బాలుడిని కోరిన దలైలామా
సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తిన విమర్శలు
తన నాలుకను నోటితో తాకాలంటూ ఓ బాలుడిని బౌద్ధ మత గురువు దలైలామా కోరడం తాజాగా
తీవ్ర వివాదాస్పదమైంది. తన నాలుకను నోటితో తాకాలంటూ ఓ బాలుడిని బౌద్ధ మత
గురువు దలైలామా కోరడం తాజాగా తీవ్ర వివాదాస్పదమైంది. సంబంధిత వీడియో సామాజిక
మాధ్యమాల్లో వైరల్గా మారింది. తన వద్ద ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చిన ఓ
భారతీయ బాలుడిని దగ్గరకు తీసుకొని అతడి పెదవులపై దలైలామా ముద్దు పెట్టినట్లు
వీడియోలో ఉంది. అనంతరం బౌద్ధ గురువు తన నాలుకను బయటపెట్టి.. ‘నీ నోటితో నా
నాలుకను తాకుతావా’ అని అడగడం వినిపించింది. దీంతో- ఆయన తీరుపై నెటిజన్లు
తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి ప్రవర్తనను సహించకూడదని, ఆయన్ను అరెస్టు చేయాలని
పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.