విజయవాడ : రాష్ట్రంలోని న్యాయవాదులకు భీమా పాలసీ మూడో వంతు ప్రీమియం ప్రభుత్వం
చెల్లించే విదంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం
తీసుకోవడం అభినందనీయమని వైసిపి రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్
శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. న్యాయవాదుల బీమా నిమిత్తం
ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని సిఎం ఆదేశాలు ఇవ్వడం వల్ల ప్రతి న్యాయ
వాదికీ పార్టీలకు అతీతంగా, చిన్నా పెద్దా తేడా లేకుండా వారి జీవితం మీద
వ్యక్తిగతంగా భరోసా కలుగుతుందన్నారు. ప్రజా ప్రస్థాన పాదయాత్రలో జగనన్న
జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెలా ప్రోత్సాహకంగా ఇస్తానన్న డబ్బులు ఇస్తానని
చెప్పిన మాట ప్రకారం డబ్బులు ఇస్తున్నారని, అదనంగా ప్రభుత్వం భీమా ప్రీమియం
ను చెల్లించేందుకు ముందుకు రావడం గొప్ప విషయమని ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు.
దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఈ తరహా పథకం లేదని, మన రాష్ట్రంలో సొంత
అన్నయ్య లాగా న్యాయవాదుల బాగోగులు గురించి ఆలోచన చేసిన ముఖ్య మంత్రి జగన్
మోహన్ రెడ్డి ఎంతగానో అభినందనీయులని ఆకుల శ్రీనివాస కుమార్ పేర్కొన్నారు.