భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ నిర్ణయాత్మక 3వ టీ20 మ్యాచ్ టైగా
ముగిసింది. భారత బ్యాటింగ్ 9 ఓవర్లు ముగిశాక మ్యాచ్‌కు వర్షం అంతరాయం
కలిగించింది. ఎంతసేపు నిరీక్షించినప్పటికీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను
రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో (DLS) మ్యాచ్
టైగా ముగిసినట్టు వెల్లడించారు. 161 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన
భారత్ 9 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్
ప్రకారం.. 9 ఓవర్లలో 76 పరుగులు చేసుంటే భారత్ విజేతగా నిలిచేది. కానీ ఒక్క
రన్ తక్కువగా 75 పరుగులే చేయడంతో టైగా ముగిసినట్టు ఇరు జట్ల కెప్టెన్లకు
అంపైర్లు వెల్లడించారు. నాలుగు వికెట్లతో రాణించిన మహ్మద్ సిరాజ్‌కు ప్లేయర్
ఆఫ్ మ్యాచ్ దక్కింది.
రెండవ మ్యాచ్‌లో భారీ శతకంలో మెరిసిన డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్
యాదవ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సీరిస్’ అవార్డ్ దక్కింది. ఈ ఫలితంతో 3 మ్యాచ్‌ల
సిరీస్‌ను 1-0 తేడాతో భారత్ కైవశం చేసుకుంది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా
రద్దవ్వగా.. రెండవ మ్యాచ్‌లో భారత్ జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. 161
పరుగుల మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాట్స్‌మెన్ ఆరంభంలో
తడబడ్డారు. 21 పరుగులకే కీలకమైన 3 వికెట్లు చేజార్చుకున్నారు. ఓపెనర్లు ఇషాన్
కిషన్ (11), రిషబ్ పంత్ (11) మరోసారి తీవ్రంగా నిరాశపరిచారు. ఆ తర్వాత
క్రీజులోకి వచ్చిన డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ కూడా 13 పరుగులు
మాత్రమే చేశాడు. అయితే కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ధాటిగా ఆడి 18 బంతుల్లోనే 30
పరుగులు కొట్టాడు. అతడికి దీపక్ హుడా (9) కాస్త సహకారం అందించాడు. దీంతో 9
ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 75 పరుగులు చేయగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో
టిమ్ సౌథి 2 వికెట్లు, ఆడమ్ మిల్నే ఒక వికెట్ చొప్పున తీశారు.
కాగా, సిరీస్ నిర్ణయాత్మక ఈ మ్యాచ్‌లో భారత పేసర్లు అద్భుతంగా రాణించారు.
ఆతిథ్య దేశం న్యూజిలాండ్‌ను భారీ స్కోరు చేయకుండా నిలువరించారు. ముఖ్యంగా
పేసర్లు మహ్మద్ సిరాజ్ , అర్షదీప్ సింగ్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి కివీస్
బ్యాటర్లను పెవీలియన్ పంపించారు. దీంతో 19.4 ఓవర్లలోనే 160 పరుగుల వద్ద
న్యూజిలాండ్ ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్‌కు 161 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని
న్యూజిలాండ్ నిర్దేశించింది.