డక్కిలి వెంకటగిరి అసెంబ్లీ ఎక్స్ప్రెస్ న్యూస్ : జనవరి 20 గ్రామపంచాయతీల జనరల్ ఫండ్ మరియు 15 ఫైనాన్స్ ప్లానింగ్ నిధులపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం డక్కిలి మండల అభివృద్ధి కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఎంపీడీవో ప్రసన్నకుమారి, ప్రత్యేక అధికారి ఎస్కే అల్లాబక్షు పాల్గొన్నారు. ఈ ఒకరోజు శిక్షణకు గ్రామ సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు. ప్రత్యేక అధికారి ఎస్కే అల్లాబక్ష మాట్లాడుతూ గ్రామపంచాయతీలో మౌలిక వసతులు సదుపాయాలైన వాటర్ డ్రైనేజీ వీధిలైట్లు రోడ్లు తదితర వసతులకు ఫిఫ్త్ ఫైనాన్స్ ప్లానింగ్ నిధులను ఎలా ఖర్చు చేసుకోవాలి, జనరల్ ఫండ్ కు వచ్చే చెరువులు వేలం పాటలు నిధులు, ఇంటి పన్నులు, కుళాయి పనులు, రిజిస్ట్రేషన్ చెస్, గ్రామపంచాయతీ వ్యాపార సముదాయాలు తదితర వాటిపై గ్రామపంచాయతీలకు ఆదాయ వనరులును సమకూర్చుకొని వాటిని గ్రామాభివృద్ధికి వినియోగించుకోవాలన్నారు.