రూ.431.58 కోట్లను రేపు (గురువారం) సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్మోహన్రెడ్డి
గుంటూరు : ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తూ, మరో ఒకరిద్దరికి సైతం ఉపాధి కల్పిస్తున్న చిరువ్యాపారులు అధిక వడ్డీల బారిన పడకుండా వారికి అండగా నిలబడుతూ, వారి ఇంట ముందుగానే పండగ సంతోషాలు వెల్లివిరిసేలా.. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ, ఒక్కొక్కరికి రూ.10,000, అంతకు పైగా 3,95,000 చిరువ్యాపారులకు రూ.417.94 కోట్ల వడ్డీలేని కొత్త రుణాలు, మొత్తం16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో చెల్లించాల్సిన 5.81లక్షల మంది లబ్ధిదారులకు రూ.13.64 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ కలిపి మొత్తం రూ.431.58 కోట్లను రేపు (గురువారం) సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారిని వారి కాళ్లమీద వారిని నిలబెడుతూ ఒక్కొక్కరికి ఏటా రూ.10,000 రుణం సున్నా వడ్డీకే అందిస్తూ, రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించినవారికి ఆ రూ.10,000కు అదనంగా ఏడాదికి మరో రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకు వడ్డీలేని రుణం అందించనున్నారు. గురువారం అందిస్తున్న వడ్డీ రీయింబర్స్ మెంట్ రూ.13.64 కోట్లతో కలిపి సకాలంలో రుణాలు చెల్లించిన 15.87 లక్షల లబ్ధిదారులకు ఇప్పటివరకు మన ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ రూ.88.33 కోట్లు. రేపు(గురువారం) అందిస్తున్న రూ.417.94 కోట్ల రుణంతో కలిపి ఇప్పటివరకు చిరువ్యాపారాలు చేసుకునే 16,73,576 మంది లబ్ధిదారులకు అందించిన వడ్డీ లేని రుణాలు రూ.3,373.73 కోట్లు.సకాలంలో రుణాలు చెల్లించిన మీ తరపున వడ్డీని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భరించనుంది. లబ్దిదారులు బ్యాంకులకు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి ఆరు నెలలకోసారి నేరుగా ఆ లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా తిరిగి ప్రభుత్వం చెల్లిస్తుంది.
వీరందరికీ ‘‘జగనన్న తోడు’’ : 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్నవారు. తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు అమ్ముకుని జీవించే వారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు. సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునేవారు. గంపలు, బుట్టలతో వస్తువులు అమ్మేవారు. చేనేత మరియు సాంప్రదాయ చేతివృత్తుల కళాకారులు. చిరువ్యాపారులను ఆదుకోవడంలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. ‘‘జగనన్న తోడు’’ ద్వారా పూర్తి వడ్డీ రాయితీ (7.32% నుండి 15.85% వరకు) ప్రభుత్వం కల్పించింది. దేశవ్యాప్తంగా ‘‘పీఎం స్వనిధి’’ ద్వారా 58,65,827 మంది చిరు వ్యాపారులకు రుణాలు అందిస్తే, ఆంధ్రప్రదేశ్ ఏకంగా 16,73,576 మందికి ‘‘జగనన్న తోడు’’ ద్వారా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాము. దేశవ్యాప్తంగా ‘‘పీఎం స్వనిధి’’ క్రింద ఇప్పటివరకు చిరు వ్యాపారులకు ఇచ్చిన రుణాలు రూ.10,220.47 కోట్లు అయితే రాష్ట్రంలో ‘‘జగనన్న తోడు’’ ద్వారా అందించిన రుణాలే అక్షరాల రూ.3,373.73 కోట్లు. దేశవ్యాప్తంగా ‘‘పీఎం స్వనిధి’’ క్రింద చిరు వ్యాపారులకు రీయింబర్స్ చేసిన వడ్డీ రూ.138.49 కోట్లుగా ఉంటే ‘‘జగనన్న తోడు’’ ద్వారా రీయింబర్స్ చేసిన వడ్డీ రూ.88.33కోట్లుగా ఉంది.