కాసేపట్లో బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం
మధ్యాహ్నం శక్తిపీఠం తుల్జాపూర్ భవాని ఆలయానికి వెళ్లనున్న సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన రెండో రోజుకు చేరుకుంది. ఈ
ఉదయం ఆయన సోలాపూర్ నుంచి పండరిపురంకు చేరుకున్నారు. పండరిపురంలోని శ్రీ విఠల్
రుక్మిణి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద
పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట పలువురు మంత్రులు,
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కాసేపట్లో సమీప గ్రామంలో బీఆర్ఎస్
కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక నేతలు
బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ మధ్యాహ్నం ఆయన శక్తిపీఠం తుల్జాపూర్ భవాని
ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోనున్నారు