కరీంనగర్ : పదేండ్ల జిల్లా ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ, పౌర
సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కలెక్టర్
కార్యాలయ సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్
2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజులపాటు నిర్వహించే కార్యక్రమంపై జిల్లా
అధికారులతోమంత్రి గంగుల కమలాకర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి
గంగుల మాట్లాడుతూ జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవంను పండుగ వాతావరణంలో
నిర్వహించాలని సంకల్పించిందని, ఈ నేపథ్యంలో ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల
షెడ్యూల్ వివరాలను అధికారులకు వివరించారు. మండల్ నియోజకవర్గం, జిల్లా వారిగా
నిర్వహించే ఏర్పాట్లపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అన్నారు. ప్రతీ శాఖ
పదేండ్ల ప్రగతి నివేదిక అభివృద్ధి పథకాలపై ప్లెక్సీ, సక్సెస్ స్టోరీ, ఫోటో
గ్యాలరీ ఏర్పాటు చేయాలని సూచించారు. మున్సిపాలిటీ, పల్లె, పట్టణాలలో,
కార్యాలయాలలో, తదితర విద్యుత్ దీపాలను వెలిగించాలని ప్రతీ గ్రామపంచాయతీ
పరిధిలో గ్రామ సభ లు ఏర్పాటు చేయాలని అన్నారు.
కలెక్టర్ ఆర్వి కర్ణన్ మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 2న
అవతరణోత్సవ వేడుకలు, 3నతెలంగాణ రైతు దినోత్సవం, 4న సురక్షా దినోత్సవం, 5న
విద్యుత్ విజయోత్సవం, 6న పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, 7న సాగునీటి దినోత్సవం,
8న ఊరూరా చెరువుల పండుగ, 9న సంక్షేమ సంబురాలు,10న సుపరిపాలన దినోత్సవం, 11న
సాహిత్య దినోత్సవం, 12న తెలంగాణా రన్, 13న మహిళా సంక్షేమం, 14న వైద్య ఆరోగ్యం,
15 నపల్లె ప్రగతి, 16న పట్టణ ప్రగతి, 17న గిరిజనోత్సవం, 18న మంచినీలా పండుగ,
19న హరితోత్సవం, 20న విద్య, 21న ఆధ్యాత్మిక దినోత్సవం, చివరగా జూన్ 22న అమరుల
సంస్మరణ కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా
కలెక్టర్ ఆర్వి కర్ణన్,,మేయర్ యాదగిరి సునీల్ రావు , కరీంనగర్ ఎమ్మెల్సీ పాడి
కౌశిక్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్,మానకొండూర్ ఎమ్మెల్యే
రసమయి బాలకిషన్, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ , సుడా చైర్మన్
జీవి రామకృష్ణారావు , ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ , పౌరసరఫరాల
శాఖ చైర్మన్సర్దార్ రవీందర్ సింగ్ , గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ అడిషనల్
కలెక్టర్ గరిమ అగర్వాల్ జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు అధికారులు పాల్గొన్నారు.