జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్
విజయవాడ : పచారీ సరుకుల కాంట్రాక్టు లో నిబంధనలు మరింత సరళీకృతం చేయాలని జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి , పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ కోరారు. జనసేన పార్టీ డిమాండ్లను పరిగణలోకి తీసుకొని ఆమోదించిన దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కి కృతజ్ఞతలు తెలిపారు. మీరు తీసుకున్న నిర్ణయాలు ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలో నురు శాతం అమలు చేస్తారని ఆశిస్తున్నాం. పచారీ సరుకుల కాంట్రాక్ట ను ఒక కాంట్రాక్టర్ కే ఇవ్వరాదని,10 కోట్ల టర్నోవర్ నిబంధనను మార్చాలని, విజిలెన్స్ శాఖ పనితీరు సరిగా లేదని , పచారీ సరుకుల కాంట్రాక్టును ఐదు నుంచి పదిమంది కాంట్రాక్టర్లకు ఇవ్వాలని ఆ విధంగా నిబంధనలను మార్చాలని డిమాండ్ చేసి ఉన్నారు. అందుకు అనుగుణంగానే నిన్న దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించిన పచారి సరుకుల టెండర్లను నిలిపివేస్తామని, 10 కోట్ల రూపాయల టర్నోవర్ నిబంధన తీసివేశామని, ఇకనుండి పచారీ సర్కుల కాంట్రాక్టు ఒక్కరికే ఇయ్యమని ఈ కాంట్రాక్ట్ ను 3 విభాగాలుగా మారుస్తున్నామని పడితరం సామాగ్రికి 1 కోటి,అన్నప్రసాదం 2 కోట్లు మరియు ప్రసాదాల పోటు సరుకులకు 5 కోట్లు టర్నోవర్ నిబంధనలో కలిగి ఉండాలని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షులు వరప్రసాద్ కార్యదర్శి రవితేజ, వసంత కుమార్ రమేష్, వాయిస్ ఆఫ్ మాల మహానాడు అధ్యక్షులు శ్యామ్, రుద్రపాటి వెంకటేష్, మధు, బండి సాయి తదితరులు పాల్గొన్నారు.