పచ్చిపాలలో చర్మానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇది చర్మాన్ని అనేక సమస్యల
నుండి కాపాడుతుంది. అటువంటి పరిస్థితిలో, చర్మంపై పచ్చిపాలను ఎలా వాడాలో
తెలుకుందాం..
టోనర్:
పచ్చిపాలని మీ స్కిన్ పై టోనర్ గా వాడొచ్చు. రాత్రి పడుకునేటప్పుడు చర్మానికి
పచ్చిపాలని రాయండి. దీని వల్ల స్కిన్ బిగుతుగా మారుతుంది. పచ్చి పాలలోని
లాక్టిక్ యాసిడ్ చర్మ లోపలి భాగాన్ని క్లీన్ చెయడమే కాకుండా మొటిమలు రాకుండా
చేస్తుంది.
సహజమైన తేమ:
మీ ముఖాన్ని క్లీన్ చేసేందుకు పచ్చిపాలని వాడడం చాలా బావుంటుంది. ఇది మీ ముఖం
నుండి మురికిని పోగొట్టడమే కాకుండా, సహజ తేమని అలానే ఉండేలా చేస్తుంది. ఇది
చర్మానికి పోషణ, తేమని అందిస్తుంది. మలినాల వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా
కాపాడుతుంది.
మసాజ్:
పచ్చిపాలతో చర్మాన్ని మసాజ్ చేయాలి. పచ్చి పాలలో దూదిని నానబెట్టి ముఖానికి
అప్లై చేయండి. తర్వాత తేలిగ్గా మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల చర్మానికి
రక్తప్రసరణ బాగా జరిగి చర్మం తాజాగా కనిపిస్తుంది.
తేనె కలిపి:
పచ్చి పాల ఓ గిన్నెలో శనగపిండి, తేనె కలపండి. ఇప్పుడు దానిని మీ చర్మానికి
అప్లై చేసి 20 నిమిషాలు ఉంచండి. ఇప్పుడు సాధారణ నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల
చర్మంలోని మురికి తొలగిపోతుంది.
ఫేస్ ప్యాక్:
పచ్చిపాలలో పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే ఫేస్ ప్యాక్ లా పనిచేస్తుంది. ఇది
ముఖంపై నల్ల మచ్చల్ని పోగొట్టి చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. దీన్ని
అప్లై చేసి 20 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి.
ఇలా రెగ్యులర్గా వాడడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. చర్మం నిగనిగలాడుతుంది.
పైగా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఉండడం వల్ల చర్మంపై ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్
ఉండవు. ఖరీదైన క్రీమ్స్ కంటే ఇవి చాలా బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
(గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే సమస్య ఏమైనా ఉంటే వైద్యున్ని
సంప్రదించడం ఉత్తమం)