కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ : కలువాయి మండలంలో పచ్చి శనగ పంట కు వేరుకుళ్ళు తెగులు సోకుతోందని రైతులు అప్రమత్తంగా ఉండాల వ్యవసాయ శాఖ అధికారి ప్రతాప్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మండలం వ్యవసాయ అధికారి ప్రతాప్ దాసరపల్లి, వేరుబోట్లపల్లి గ్రామాల్లో పర్యటించి తెగులు సోకిన పంటను పరిశీలించారు. గ్రామాల్లో రైతులతో సమావేశం ఎర్పాటు చేసి తెగులు నివారణ కు ఏ మందులు వాడాలో సూచించారు. ఏఓ ప్రతాప్ విలేకరుల తో మాట్లాడుతూ… మండలం లో 1500 ఎకరాల్లో పచ్చి శనగ పంటను రైతులు సాగు చేశారన్నారు. ప్రస్తుతం పంట కు వేరు కుళ్ళు తెగులు సోకి ఉందని తెలిపారు. తెగులు నివారణకు 2 గ్రాములు సాఫ్ పౌడర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. తిరిగి ఏడు రోజుల తర్వాత పిచికారీ చేస్తే వేరు కుళ్ళు తెగులు పూర్తి గా నివారణ అవుతుందన్నారు. ఈ సమావేశంలో గ్రామ సచివాలయం వీ ఏ ఏ వెంకట రత్నం, రైతులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్.. రైతులకు సూచనలు ఇస్తున్న ఏఓ ప్రతాప్.
తెగులు సోకిన వేరుశనగ పంట.