మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఆర్మీ
సైతం పాల్గొంటోంది. భువనేశ్వర్ సహా బాలేశ్వర్, భద్రక్, మయూర్భంజ్,
కటక్‌లోని ఆస్పత్రల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు
క్షతగాత్రుల్లోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల్లో బెంగాలీవాసులే
ఎక్కువ మంది ఉన్నారనేది ఒక అంచనా. ఇక మృతుల్లో, గాయపడిన వాళ్లలో తెలుగువాళ్లు
కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బాలాసోర్ రైలు ప్రమాద ఘటనా స్థలానికి
చేరుకున్నారు. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి ఆయన అక్కడి అధికారులతో
ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.*
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఘటనా స్థలానికి చేరుకుని
పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకోవడంతో సహాయక
చర్యలను పర్యవేక్షించారు. ఆ సమయంలో ఆయన వెంట ఒడిశాకు చెందిన కేంద్ర శాఖమంత్రి
(సహాయక) ప్రతాప్ చంద్ర సారంగి కూడా ఉన్నారు. ప్రమాదంపై అత్యున్నత స్థాయి
దర్యాప్తునకు ఆదేశించిన విషయాన్ని మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు
వెల్లడించారు. ‘‘ రైలు ప్రమాద ఘటన చాలా బాధాకరం. ప్రస్తుతం సహాయక చర్యల మీదే
ఫోకస్ పెట్టాం. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. బాధితులకు మెరుగైన
వైద్యం అందిస్తున్నాం. దర్యాప్తునకు హైలెవల్ కమిటీని నియమించాం. విచారణ
తర్వాతే ప్రమాదానికి కారణాలు చెప్పగలం’’ అని మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు
తెలిపారు.