విశాఖపట్నం: అనకాపల్లి-తాడి మార్గంలో బుధవారం ఉదయం గూడ్స్ రైలు పట్టాలు
తప్పింది. గూడ్స్ రైలుకు చెందిన అయిదు బోగీలు పట్టాలు తప్పడంతో ట్రాక్
దెబ్బతింది. దీంతో విశాఖ- విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం
ఏర్పడింది. పలు రైళ్లు రద్దు కాగా వందేభారత్ ఎక్స్ప్రెస్ మూడు గంటలు
ఆలస్యంగా నడుస్తుంది.

రద్దైన రైళ్ల వివరాలు ఇవీ
►నేడు ఆరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది.
►విశాఖ- లింగంపల్లి జన్మభూమి, విశాఖ-గుంటూరు ప్యాసింజర్ రైళ్లు రద్దు.
►రేపు లింగంపల్లి-విశాఖ జన్మభూమి, గుంటూరు-విశాఖ ప్యాసింజర్ రైళ్లు రద్దు.
►నేడు విశాఖ- విజయవాడ, విజయవాడ-విశాఖ ప్యాసింజర్ రైళ్లు రద్దు