హోంమంత్రి డా.తానేటి వనిత
కొవ్వూరు : కొవ్వూరు పట్టణం 8వ వార్డ్ లో 95 వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం
కార్యక్రమంలో హోంమంత్రి డా.తానేటి వనిత పాల్గొన్నారు. సంక్షేమ పథకాల గురించి
తెలుసుకోవడానికి ఏ ఇంటికి వెళ్లినా ప్రజల్లో సంతోషమే కనపడుతోందన్నారు. సీఎం
జగన్ గారు అందిస్తున్న పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. ఒక్కో
కుటుంబానికి లక్ష రూపాయల నుండి పది లక్షల రూపాయల వరకు సంక్షేమ పథకాల రూపంలో
లబ్ది చేకూరుతోందన్నారు. ప్రజలకు మంచి చేయాలి, రాష్ట్రం ప్రగతి పథంలో నడవాలనే
సదుద్దేశంతో సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారని తెలిపారు. ప్రజల నుండి వచ్చే
చిన్న చిన్న సమస్యలను కూడా అధికారులు వెంటనే పరిష్కరించాలని హోంమంత్రి తానేటి
వనిత ఆదేశించారు.