కృత్రిమ మేధ వినియోగానికి కేంద్రం నియమ నిబంధనలు పెట్టాలి
విజయవాడ : జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఇటు ప్రభుత్వంలోనూ అటు పార్టీలోనూ
బీసీలకు పెద్దపీట వేసి అత్యధిక పదవులు ఇచ్చారని రాజ్యసభ సభ్యులు, వైసీపీ
జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్
వేదికగా శనివారం ఆయన పలు అంశాలు వెల్లడించారు. ఇటు కేబినెట్ నుంచి నామినేటెడ్
పోస్టుల వరకు బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పించారని అన్నారు. అలాగే బీసీల్లో
పేదరిక నిర్మూలన సీఎం జగన్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని అందుకు ఆయన
ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పెద్ద ఉదాహరణ అని అన్నారు. బీసీ కుల గణనకు
వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. నాలుగేళ్లుగా బీసీల సంక్షేమానికి
జగన్ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు వివరించాలని పార్టీ బీసీ నాయకులను
పిలుపునిచ్చారు.
గుడ్లు వేయించుకొని గుడ్లు తేలేస్తే ఎలా : తనను ఎవరూ పట్టించుకోవడం లేదని
ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు తనపై కార్యకర్తలతోనే గుడ్లు వేయించుకొని గుడ్లు
తేలేస్తే ఎలా అని అన్నారు. గుడ్లు వేయించుకున్నంత మాత్రాన గండరగండలు అవుతారా
అని ప్రశ్నించారు.
కృత్రిమ మేధ వినియోగానికి కేంద్రం నియమ నిబంధనలు పెట్టాలి : కృత్రిమ మేధకు
సంబంధించి అనేక పుకార్లు, భయాలు ప్రజల్లో ఉన్నాయని విజయసాయి రెడ్డి అన్నారు.
కృత్రిమ మేధ కారణంగా చాలా ఉద్యోగాలు ప్రైవేటు పరం కానున్నాయని కొందరు భావిస్తే
ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఇంటర్నెట్ వినియోగదార్లు అనేక రకాల
మోసాలకు గురవుతారని, బాధితులు అవుతారని మరికొందరు భావిస్తున్నారని అన్నారు. ఈ
పరిస్థితుల్లో కేంద్రం కృత్రిమ మేధ వినియోగానికి సంబందించి నియమ నిభంధనలు
రూపొందించాలని సూచించారు. అప్పడే అది సన్మార్గంలో ఉపయోగించబడుతుందని విజయసాయి
రెడ్డి అన్నారు.