‘గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో మరో చిత్రం
రాబోతున్న సంగతి అందరికి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న
చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్”. ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది.
నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే రెండో
షెడ్యూల్ చిత్రీకరణ మొదలుకానుందని సినీవర్గాలు తెలిపాయి. అందుకోసం కళాదర్శకుడు
ఆనందసాయి నేతృత్వంలో ప్రత్యేకంగా సెట్ ని తీర్చిదిద్దారు. పవన్ కల్యాణ్
తోపాటు, ఇతర తారాగణంపై కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. గబ్బర్
సింగ్ విడుదలైన పదేళ్ల తర్వాత పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కలయికలో వస్తున్నఈ
చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ని
విడుదల చేశారు. ‘గబ్బర్ సింగ్ తరహాలోనే పవన్ కల్యాణ్ మరోసారి పోలీస్ గానూ, ఇతర
భిన్నమైన గెటప్పుల్లోనూ కనిపించనున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి
దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.