పనీర్ ను చాలామంది ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ తినని వారు పనీర్ తీసుకోవడం
వల్ల బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ లభిస్తాయి. ఈ పనీర్ తినటం వల్ల చాలా
లాభాలున్నాయి. అవి ఏమిటంటే..
ఎముకల బలానికి:
శరీరానికి కావాల్సిన కాల్షియం, ఫాస్పరస్, విటమిన్లు, మినరల్స్ పనీర్ లో
పుష్కలంగా ఉంటాయి. పనీర్ లోని కాల్షియం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.
ఆస్టియోపోరోసిస్ వంటి రోగాలు రాకుండ కూడా కాపాడుకోవచ్చు.
బరువు నియంత్రణ:
పనీర్ కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. మీ ఆకలి
తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అందువల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.
కండరాల ఆరోగ్యం:
పనీర్ లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఈ ప్రోటీన్లను ఎక్కువగా తినడం వల్ల
కండరాల ఆరోగ్యం అలాగే కండరాల సమస్యలు మెరుగుపడుతాయి.
డయాబెటిస్:
పనీర్ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కార్బోహైడ్రేట్లు తక్కువగా,
ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నందువల్ల డయాబెటిస్ రోగులకు మేలు జరుగుతుంది. రక్తంలో
చక్కెర స్థాయిల్ని నియంత్రణలో ఉంచుతుంది. కానీ మితంగా తినడం మంచిది.
రోగనిరోధక శక్తి:
పనీర్ లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో
సహాయపడుతుంది.దీనివల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.
మెదడు ఆరోగ్యానికి:
పనీర్ లో విటమిన్ బీ12 అధికంగా లభిస్తుంది. ఇది మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు
చేస్తుంది. అలాగే విటమిన్ బీ12 లోపాన్ని తగ్గిస్తుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది:
పనీర్ మీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గిపోతుందని
అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
దంతాలని బలంగా:
పనీర్ లో కాల్షియం పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి దంతాలను బలంగా చేస్తాయి. దంత
సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.