ప్రతిపక్ష హోదాలో ఉండి పాదయాత్రలు చేశారని.. ఏ అర్హతతో లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడని ప్రశ్నించారు. లోకేష్ మొదటగా ఎమ్మెల్యేగా గెలవాలని.. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పాదయాత్ర చేయాలని అభిప్రాయపడ్డారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి జీరో సీట్లు వస్తాయని అన్నారు. అప్పుడు లోకేష్, చంద్రబాబును తన్ని
బయటకు తరిమి.. ఎన్టీఆర్ వారసులు పార్టీని మళ్లీ హస్తగతం చేసుకుంటారని పేర్కొన్నారు. లోకేష్ పాదయాత్రతో టీడీపీకి ఎలాంటి ఉపయోగం లేదని.. అతని పాదయాత్రతో టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చే సీన్ లేదని తేల్చి చెప్పారు.అసలు లోకేష్ ఏ ఎన్నికల్లో గెలిచాడని ప్రజల ముందుకు పాదయాత్ర పేరుతో వస్తున్నాడని కొడాలి నాని నిలదీశారు. దొడ్డి దారిలో ఎమ్మెల్యీ, మూడు శాఖల మంత్రుల పదవులు చేపట్టి.. మంగళగిరిలో లోకేష్ చిత్తు చిత్తుగా ఓడిపోయాడని గుర్తు చేసుకున్నారు. టీడీపీలో వారసత్వం కోసమే లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడని.. ఆ పార్టీలోని కార్యకర్తలు, నాయకులే అతడ్ని నమ్మడం లేదని చెప్పారు. టీడీపీని హస్తగతం చేసుకోవడానికి, చంద్రబాబు వారసత్వం కోసమే లోకేష్ ఈ పాదయాత్ర చేస్తున్నాడన్నారు. శాసనసభ్యుడిగా ఓడిపోయినా వాడు పాదయాత్ర చేయడమేమిటని ప్రశ్నించారు. ఇటువంటి పుప్పులు ఎన్ని పాదయాత్రలు చేసినా.. వైసీపీని గెలుపు నల్లేరు మీద నడకలాంటిదన్నారు. టీడీపీ ఎన్టీఆర్ రక్తంతో పుట్టిన పార్టీ అని.. ఎన్టీఆర్ వారసులు, సమర్థుల నుండి పార్టీని లాక్కోవడానికే ఈ పాదయాత్ర అని కొడాలి నాని విమర్శించారు.
అంతకుముందు.. కృష్ణాజిల్లా గుడివాడలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లోనూ టీడీపీపై కొడాలి నాని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ పేరు, ఫోటోలతో అనేకమంది రాజకీయాలు చేస్తున్నారని.. ఎన్టీఆర్ తమకు ఆదర్శమంటూ కొందరు ముసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఆదర్శమైతే, ఆయనకు ఎందుకు వెన్నుపోటు పొడిచారని నిలదీశారు. ఎన్టీఆర్‌ను క్షోభకు గురిచేసిన దొంగలను ఆయన అభిమానులు మట్టి కరిపించారని అన్నారు. ఎన్టీఆర్ పదవిని దొంగలించిన చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, అప్పటి నాయకులు.. ఇప్పటికీ ఎన్టీఆర్ పేరుతో ఓట్లు పొందుతున్నారన్నారు. ఎన్టీఆర్ గొప్పతనాన్ని గుర్తుంచుకున్న సీఎం జగన్.. ఓ జిల్లాకు ఆయన పేరు పెట్టారన్నారు.కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్.. అసమర్థుడని ఫైర్ అయ్యారు. చందాలిచ్చిన వారి కోసం తప్ప.. లోకేష్ పాదయాత్ర దేనికి పనికిరాదని మాజీ మంత్రి కొడాలి అన్నారు.
లోకేష్ ఏం సాధించారని.. ఏ హోదాలో పాదయాత్ర చేస్తున్నారు? అని కొడాలి నాని ప్రశ్నించారు. పోటీ చేసిన చోట ఓడిపోయిన పప్పు సుద్ద లోకేష్ అన్నారు. ‘లోకేష్ ఏ హోదాలో పాదయాత్ర చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తి పాదయాత్ర చేస్తే.. ఏం లాభం. ప్రజలకు లోకేష్ ఏం చెప్తారు. జగన్ ఒక ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేశారు. సక్సెస్ అయ్యారు. మూడేళ్లు, మూడు శాఖలకు మంత్రిగా పనిచేసినా.. లోకేష్‌ను మంగళగిరి ప్రజలు ఓడించారు. లోకేష్ పాదయాత్ర వల్ల టీడీపీకి, చంద్రబాబుకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇలాంటి వారు వచ్చి యాత్రలు చేస్తే.. వైఎస్సార్సీపీ గెలుపు ఇక నల్లేరు మీద నడకే’ అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.