పరిణీతి చోప్రా స్వేచ్ఛ అనుభూతి చెందుతున్నారట. ఈ విషయం ఆమే నేరుగా సోషల్ మీడియాలో చెప్పడం విశేషం. బాలీవుడ్ సుందరి పరిణీతి చోప్రా తాజాగా యూకేలోని సెయింట్ లియోనార్డ్స్ వారియర్ స్క్వేర్ స్టేషన్లో దిగిన చిత్రాన్ని షేర్ చేసింది. ఆ చిత్రంలో పరిణీతి స్ట్రీట్ స్టైల్ లుక్లో అద్భుతంగా కనిపిస్తోంది. ఫోటోతో పాటు, నటి “ఫ్రీ” అని రాసి, ఎగిరే పక్షి ఎమోజీని జోడించింది. పరిణీతి చేసిన పోస్ట్ కు ఆమె సోదరి నటి ప్రియాంక చోప్రా స్పందించారు. ప్రియాంక రెడ్ హార్ట్ ఐ ఎమోజీతో పాటు “అయ్యో” అని రాసింది. దీనికి పరిణీతి, “ప్రియాంక చోప్రా, నా ఉద్దేశ్యం మీ కంటే బాగా ఎవరికీ తెలియదు. ” అంటూ రిప్లై కామెంట్ ఇచ్చింది. ఇలా పరిణీతి చోప్రా, ప్రియాంక చోప్రా అద్భుతమైన బంధాన్ని పంచుకున్నారు. కామెంట్స్ సెక్షన్లలో ఒకరికొకరు నోట్స్ పెట్టుకోవడం నుంచి ప్రత్యేక రోజులలో హృదయాన్ని కదిలించే నోట్స్ పంచుకోవడం వరకు, ఇద్దరూ సోదరిమణులు ఇలా నిత్యం సోషల్ మీడియాలో తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.