వెల్లడించారు. బెంగళూరు లోని నారాయణ హ్రుదయాలయ వైద్యశాలలో చికిత్స పొంతున్న
తారకరత్నను జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, వసుంధర, బ్రాహ్మణి చూశారు.
కర్ణాటకా ఆరోగ్య శాఖ మంత్రి సురేష్ ఆసుపత్రికి వచ్చి తారకరత్నకు అందుతున్న
వైద్యసేవలపై ఆరాతీశారు.
హృదయాలయ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. శనివారం వేకువజామున కుప్పం
నుంచి బెంగుళూరుకు తీసుకువచ్చి ప్రత్యేక వైద్య బృందంతో అత్యున్నత చికిత్సను
అందిస్తున్నారు. తారకరత్న ఆరోగ్యం క్షీణించిన పరిస్థితుల్లో అద్భుతం
జరిగిందని చెప్పారు. వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని, వైద్య సేవలకు
తారకరత్న స్వందిస్తున్నారని వివరించారు. దేవుడి కృపతో, అభిమానుల ప్రార్ధనతో
తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానన్నారు. నిన్నటి కన్నా ఈ రోజు
తారకరత్న ఆరోగ్య స్థితి మెరుగ్గా ఉంది. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
చికిత్సకు తారకరత్న స్పందిస్తున్నారు. తారకరత్న కోలుకోవాలని అభిమానులు
ప్రార్థించాలని బాలకృష్ణ అన్నారు.తారకరత్న ఆరోగ్యంగా బయటకు వస్తారు : జూనియర్ ఎన్టీఆర్ స్పందన
తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. మెరుగైన వైద్యం
అందుతోందని, వైద్యానికి స్పందిస్తున్నారు ఎన్టీఆర్ అన్నారు. తారకరత్న
పోరాడుతున్నారని, ఆత్మబలంతో పాటు అభిమానుల బలం ఉందని పేర్కొన్నారు. ఎంతోమంది
ఆశీర్వాదం తారకరత్నకు ఉందని అంతేకాకుండా త్వరగా కోలుకోవాలని
ప్రార్థిస్తున్నామని తెలిపారు. కర్ణాటక వైద్యశాఖ మంత్రి సుధాకర్ ఎంతో
సహకరించారని వెల్లడించారు. తారకరత్న పోరాడుతున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం
అందిస్తున్నారు. ఆత్మబలం, అభిమానుల ఆశీర్వాదం అతడికి ఉంది. ఆరోగ్య పరిస్థితి
క్రిటికల్‌గా ఉన్నా వైద్యానికి సహకరిస్తున్నారు. నేను ఐసీయూలోకి వెళ్లి
పలకరించే ప్రయత్నం చేశాను. కొంత స్పందన కనిపించింది. నిన్నటితో పోలిస్తే
పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఒక కుటుంబసభ్యుడిగా వారు
నాకు ధైర్యం చెప్పారు.