అమరావతి : క్లర్క్ ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించే పరీక్ష తేదీల్లో మార్పు చేయాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కి ఏపీపీఎస్సీ కార్యదర్శి లేఖ రాశారు. ఫిబ్రవరి 25న ఎస్బీఐ క్లర్కు నియామక పరీక్షను నిర్వహిస్తోంది. అదే రోజు గ్రూప్ 2 పరీక్షను ఏపీపీఎస్సీ షెడ్యూల్ చేసింది. రాష్ట్రానికి చెందిన కొందరు అభ్యర్థులు రెండు పరీక్షలకూ దరఖాస్తు చేసుకున్నారని, వారు అవకాశం కోల్పోకుండా ఎస్బీఐ ఆరోజు పరీక్షను మరో తేదీకి వాయిదా వేయాలని లేఖలో పేర్కొన్నారు.