కాకినాడ : కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య
దినోత్సవం రోజున, గణతంత్ర దినోత్సవం నాడు ఉత్సవాలు జరగడం అప్పటికప్పుడు నిధులు
వెచ్చించి తాత్కాలికంగా సందర్శకుల గ్యాలరీల వంటివి నిర్మిస్తున్న విషయం
అందరికీ తెలిసిందే. ఈ విధమైన ప్రక్రియతో సమయం, ఆర్ధిక వనరులు ఖర్చు అవ్వడం,
అలాగే వర్షా కాల సమయంలో అయితే మరింత ఇబ్బంది పడడం అనే విషయాలపై దృష్టి
సారించిన జిల్లా ఎస్.పి యం.రవీంద్రనాథ్ బాబు ఈ విషయాన్ని జిల్లా కలక్టర్ కి
తెలియ చెప్పి సహకారం కోరడంతో వారు వెంటనే స్పందించారు. ఓ.ఎన్.జి.సి. వారు
ఇచ్చిన సి.ఎస్.ఆర్. ఫండ్స్ నుండి 10 లక్షల రూపాయలను జిల్లా కలక్టర్ డాక్టర్
కృతికా శుక్లా పరేడ్ గ్రౌండ్ లో సందర్శకుల గ్యాలరీ నిర్మాణము కోసం మంజూరు
చేశారు. ఈ నిర్మాణాన్ని జిల్లా అదనపు ఎస్.పి (రిజర్వ్) బి.సత్యనారాయణ
నేతృత్వం లో త్వరితగతిన పూర్తి చేశారు. ఈ సందర్శకుల గ్యాలరీని కాకినాడ జిల్లా
కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ
ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కాకినాడ
జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాథ్ బాబు తో పాటు ఓ.ఎన్.జి.సి. ఎగ్జిక్యూటివ్
డైరెక్టర్ అండ్ అసెట్ మేనేజర్ ఆదేశ్ కుమార్ శర్మ, ఓ.ఎన్.జి.సి. హెచ్ఆర్
విభాగపు అధిపతి డి.మాలిక్, అడిషనల్ ఎస్పి అడ్మిన్ పి శ్రీనివాస్, ఏఆర్ అడిషనల్
ఎస్పి శ్రీ బి. సత్యనారాయణ, కాకినాడ స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి యం.అంబికా
ప్రసాద్, ట్రాఫిక్ డి.ఎస్.పి ఎం. వెంకటేశ్వర రావు, కాకినాడ ఎస్సీ ఎస్టీ సెల్
డి.ఎస్.పి. బి.అప్పారావు, క్రైమ్ డిఎస్పీ ఎస్.రాంబాబు, డిఎస్పీ వెంకట
అప్పారావు, శ్రీహరిరావు, పి. అప్పారావు, కాకినాడ పట్టణ, గ్రామీణ సి.ఐలు, ఇతర
అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ విషయం లో చొరవ తీసుకుని జిల్లా కలక్టర్
సహకారం తో పరేడ్ గ్రౌండ్ లో సందర్శకుల గ్యాలరీ నిర్మాణం చేసినందుకు గాను
జిల్లా ఎస్.పి ఎం. రవీంద్రనాథ్ బాబుకి జిల్లా పోలీసులందరి తరపున కృతజ్ఞతలు
తెలియ చేస్తున్నట్లుగా జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, జిల్లా పోలీసు
అధికారుల సంఘ నాయకులు సత్యమూర్తి పేర్కొన్నారు. అలాగే జిల్లా కలెక్టర్,
ఓ.ఎన్.జి.సి వారికి కృతజ్ఞతలు తెలిపారు.