శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్
గద్వాల : రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన
సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గద్వాల జిల్లా పర్యటనలో
భాగంగా అలంపూర్ లోని ప్రముఖ శక్తి పీఠం జోగులాంబ దేవాలయం లో అమ్మవారిని
దర్శించుకున్నారు. దేవాలయంలో మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ గారికి
జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, దేవస్థానం పాలక మండలి చైర్మన్, సభ్యులు, వేద
పండితులు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. జోగులాంబ అమ్మవారికి ప్రత్యేక
పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ గారికి
అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
ఆనంతరం అలంపూర్ లోని జోగులాంబ దేవి దేవాలయం కు వచ్చే భక్తులకు, పర్యాటకులకు
మౌలిక సదుపాయాల కల్పనలో 7 ఎకరాల 7 గంటల విస్తీర్ణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా 36
కోట్ల 73 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న జోగులాంబ దేవి దేవాలయం టూరిజం
డెవలప్మెంట్ సెంటర్ లో పర్యాటకుల సౌలభ్యం కోసం నూతనంగా నిర్మిస్తున్న మౌలిక
సదుపాయాల కల్పన ను రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు.
వచ్చే రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
జోగులాంబ దేవాలయం కు వచ్చే భక్తులకు, పర్యాటకుల సౌలభ్యం కోసం మౌలిక సదుపాయాల
కల్పన కు పెద్దపీట వేయలని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను
ఆదేశించారు. జోగులాంబ దేవాలయం కు వచ్చే భక్తులకు, పర్యాటకులకు మౌలిక సదుపాయాల
కల్పనలో భాగంగా డెవలప్మెంట్ ఆఫ్ బస్టాండ్ బస్ బేస్ నిర్మాణం, డ్రైవ్ వేవ్స్,
సీసీ రోడ్స్, 14 సీటర్స్ ఎలక్ట్రికల్ బస్సెస్, ల్యాండ్ స్కేపింగ్ లను
నిర్మిస్తున్నామన్నారు. అలాగే, డవలప్మెంట్ ఆఫ్ పిలిగ్రిం ఫెసిలిటేషన్ &
కల్చరల్ హాట్ లో భాగంగా ఒపెన్ ఎయిర్ థియేటర్, ఎంట్రెన్స్ ప్లాజా, ఆర్ట్
గ్యాలరీ, మల్టీ మీడియా ఇంటర్ ప్రిటేషన్, పబ్లిక్ అమెనిటీస్, వెయిటింగ్ హల్,
వెండర్స్ స్టాల్, వెయిటింగ్ హల్, ఫుడ్ కోర్ట్స్, అనందన సత్రం, టాయ్ లెట్స్
బ్లాక్స్, బంక్వాట్ హల్, డైనింగ్ హాల్, పర్యాటకులకు రెస్ట్ రూం లు, ఇంటర్నల్
పాత్వేస్, యాత్రికుల పార్కింగ్, లాండ్ పాత్ వేస్, సీసీ రోడ్స్ లాండ్ స్కేపింగ్
లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పర్యాటకుల సౌలభ్యం కోసం పెద్దపీట వేయాలని
మంత్రి అధికారులను ఆదేశించారు. జోగులాంబ దేవి దేవాలయం పరిసరాలలో
పర్యాటకాభివృద్ధి లో భాగంగా పార్కింగ్, వరద కాలువల నిర్మాణం, దేవాలయ ముఖ
ద్వారం, లైటింగ్ సీసీటీవీలో ఏర్పాటు కాంపౌండ్ వాల్ నిర్మాణం పనులు వేగవంతంగా
పూర్తి చేయాలని మంత్రి అధికార ఆదేశించారు. దేవాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా
అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. వీటితోపాటు పార్కుల ఏర్పాటు,
లాండ్స్ స్కేపింగ్, తుంగభద్ర ఘాట్ అభివృద్ధి ఇలా పనులను వేగవంతంగా పూర్తి చేసి
ఆగస్టు నెలలో ప్రారంభించుకోవాలని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్
అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి,
ఎమ్మెల్యేలు డాక్టర్ అబ్రహం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రభుత్వ రంగ సంస్థల
చైర్మన్లు డాక్టర్ ఆంజనేయ గౌడ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, గట్టు తిమ్మప్ప,
జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు
పాల్గొన్నారు.