పల్లెలు, పట్టణాల అభివృద్ధితోపాటు పచ్చదనాన్ని మరింత పెంచే దిశగా ప్రభుత్వం
బడ్జెట్ కేటాయింపులు చేసింది. స్థానిక సంస్థల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి, హైదరాబాద్లో ట్రాఫిక్, తాగునీటి
సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారంపై దృష్టి సారించింది. సొంతజాగాల్లో
ఇళ్లనిర్మాణానికి ఈ బడ్జెట్లో కేటాయింపులు చేశారు.