టీడీపీకి మేలు చేయడమే పవన్ లక్ష్యం
పేదవాడికి మంచి చేయడం సీఎం జగన్ ధ్యేయం
మీడియాతో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టీకరణ
టీడీపీ అధినేత చంద్రబాబుకు మేలు చేయడమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంతిమ
లక్ష్యమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. పేదవాడి
సొంతింటి కల సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు చేయడం తగదని హితవు
పలికారు. సాధారణంగా మన ఇంట్లో కరెంట్ పోతే ఇన్వర్టర్ అందుబాటులో
ఉంచుకుంటామని, అదే తరహాలో పవన్‌కళ్యాణ్‌ను ఓ ఇన్వర్టర్లా చంద్రబాబు
వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అనంతపురం నగరంలోని 9, 10 డివిజన్లలో
కార్పొరేటర్లు వై.లక్ష్మిదేవి. ఎం.దేవిలతో కలిసి ఆదివారం ఆయన గడప గడపకు మన
ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని ప్రతి
ఇంటికి వివరిస్తూ బుక్లెట్లు అందజేశారు. స్థానిక సమస్యల గురించి ప్రజలతో ఆరా
తీసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ పని
చేస్తుంటే.. పేదవాడి సంక్షేమం కోసం జగన్మోహన్రెడ్డి పాలన
సాగిస్తున్నారన్నారు. ఏ గడపను తాకినా ఈ మూడేళ్ల పాలనలో ఎంతో సంతోషంగా ఉన్నామని
ప్రజలు చెబుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పనితీరును ఇతర రాష్ట్రాలు కూడా
అధ్యయనం చేస్తున్నాయన్నారు. పేదవాళ్లకు సొంతిళ్లు లేదన్న మాటే రాకుండా
ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు
చేపడుతున్నామన్నారు. అన్ని సదుపాయాలతో జగనన్న కాలనీలు
రూపుదిద్దుకుంటున్నాయన్నారు. గతంలో ప్రభుత్వాలు ఇళ్ల నిర్మాణాలకు సబ్సిడీలు
మాత్రమే ఇచ్చేవని, కానీ సీఎం జగన్మోహన్రెడ్డి మాత్రమే స్థలాలు ఇచ్చి ఉచితంగా
ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకున్నారని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి ఇలాగే
కొనసాగితే తమకు రాజకీయ భవిష్యత్ ఉండదని భావించి అడుగడుగునా సైంధవుల్లా
ప్రతిపక్ష నేతలు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.
2014 నుంచి 2019 వరకు టీడీపీ, బీజేపీ కలిసే ప్రభుత్వంలో ఉన్నాయని, వారికి
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మద్దతుగా ఉన్నారని గుర్తు చేశారు. ఆ ఐదేళ్లు
పేదవాడికి స్థలాలు ఇవ్వాలని గానీ, ఇళ్లు కట్టించాలని గానీ చంద్రబాబు
ఆలోచించకపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. అప్పుడు పవన్
కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కేవలం టీడీపీ అధికారం కోల్పోయిందన్న
బాధ, వైసీపీ అధికారంలో ఉందన్న అక్కసుతోనే ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలని
పవన్ కళ్యాణ్ చూస్తున్నారన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఎన్నికలు
ఎప్పుడు వచ్చినా వాళ్లకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అలాగే
నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. 2, 8, 9, 10 డివిజన్లలో
మురికివాడలు అధికంగా ఉన్నాయని.. ఆయా ప్రాంతాల్లో దశలవారీగా ప్రణాళికాబద్ధంగా
పనులు చేపడతామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో మేయర్ మహమ్మద్ వసీం, కమిషనర్ భాగ్యలక్ష్మి, అడిషనల్ కమిషనర్
రమణారెడ్డి, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి,
మార్కెట్ యార్డు చైర్మన్ ఫయాజ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్
గౌస్‌బేగ్, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ
సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.