విజయవాడ : మూడు నెలల తర్వాత పవన్ కళ్యాణ్ బయటికొచ్చి హడావిడి చేస్తూ బీసీలు,
కాపులు కలిసి రాజ్యాధికారం చేపట్టాలని మాట్లాడుతున్నాడని మంత్రి దాడిశెట్టి
రాజా ధ్వజమెత్తారు. తుని రైలు దహనం కేసు ఘటనలో విజయవాడ రైల్వే కోర్టుకు మంత్రి
దాడిశెట్టి రాజా, సినీనటుడు జీవా, ఇతర కాపు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం అంటే చంద్రబాబు పల్లకీ మోయడమేనా అంటూ
మండిపడ్డారు. కొత్తగా చంద్రబాబుతో కలిసి ఉన్నట్లు పవన్ మాట్లాడుతున్నాడని,
వాళ్లిద్దరూ 2014 నుంచి కలిసే ఉన్నారని వ్యంగాస్త్రాలు సంధించారు.
చంద్రబాబుకు, తనకు కాపులు ఓటేయకపోతే బీసీలు బానిసలైపోతారనేలా పవన్ మాట్లాడుతూ
ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్నారు. ఈనెల 14న పవన్ యాక్టింగ్‌ను బట్టి
అతని ప్యాకేజ్ ఉంటుందన్న ఆయన అదే రోజు నాటు నాటు పాటకు మించి పవన్ డాన్సు
ఉంటుందని వ్యంగ్రాస్త్రాలు సంధించారు. కాపులతో పాటు ఎస్సీ,ఎస్టీల పై కేసులు
ఎందుకు పెట్టావని చంద్రబాబుని అడిగావా పవన్ అంటూ ఫైర్ అయ్యారు. 2024లో 175
కి 175 స్థానాలు గెలిచి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.