గుంటూరు : నారాహిగా పెట్టుకోవాల్సిన వాహనం పేరును వారాహిగా పవన్
పెట్టుకున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. గురువారం
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ పవన్ పూటకొక
మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రోజుకొక డైలాగ్ చెప్పి పవన్ వ్యూహం అంటారు.
చంద్రబాబు బాగుండటం కోసం పవన్ ఏదైనా చేస్తాడని మండిపడ్డారు. ‘‘చంద్రబాబు
చొక్కా పట్టుకొని పవన్ ఏనాడైనా నిలదీశారా?. పవన్ ఆఫీసులో కూర్చొని సినిమా
డైలాగ్లు, సొల్లు కబుర్లు చెబుతాడు. పవన్ ఒక చెప్పు చూపిస్తే.. నేను రెండు
చెప్పులు చూపిస్తాను.. పవన్ను అడ్డం పెట్టి జనసేన పార్టీని చంద్రబాబు
నడుపుతున్నారు. చంద్రబాబు, పవన్, బీజేపీ కలిసి ప్రభుత్వం నడిపినప్పుడు సొంత
డబ్బు ఖర్చుపెట్టారా?. పవన్ ప్రతి సినిమా రిలీజ్ ముందు కేసీఆర్ కాళ్లు
మొక్కుతాడు. గులాబీ జెండాను వెనక జేబులో పెట్టుకొని తిరుగుతున్నదెవరు?’ అంటూ
పేర్ని నాని నిప్పులు చెరిగారు. ‘హరీష్రావు ఆంధ్రరాష్ట్రాన్ని తిడుతుంటే పవన్
ఏం చేస్తున్నారు?. జగన్ సీఎం అయినప్పటి నుంచి పవన్ ఒక్క సినిమా అయినా ఆగిందా?.
పవన్, బీజేపీ, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సినిమా టికెట్లపై జీఎస్టీ వేసారా?
లేదా?. సీఎం పదవి అనేది ఎవరో దానం చేస్తే వచ్చేది కాదు.. పవన్ డ్రామాలు వేస్తే
మక్కెలిరగదీస్తాం అంటూ పేర్ని నాని మండిపడ్డారు.