విజయవాడ : పవన్ కల్యాణ్ అధికారంలోకి రావటం ఒక కల అని మాజీ మంత్రి, పశ్చిమ
నియోజకవర్గం శాసనసభ్యులు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక ఊసరవెల్లి,
విశ్వాస ఘాతకుడు అని విమర్శించారు. జనసేన పార్టీ ఈ రాష్ట్రానికి ఒక పనికిమాలిన
పార్టీ అని, చంద్రబాబు భజన పార్టీ అని ఆరోపించారు. స్థానిక భవానిపురంలో గల
ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో
మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొని
ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులర్పించి పార్టీ
జెండాను ఆవిష్కరించారు అనంతరం కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు కార్యకర్తలకు
శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ గత 13 ఏళ్లు గా ఈ రాష్ట్రానికి దిశ దశ జగన్
మోహన్ రెడ్డి అని కొనియాడారు. కోవిడ్ లో రాష్ట్రం అతల కుతలం అయినా రాష్ట్ర
ప్రభుత్వం తోడుగా ఉందని, అదే చంద్రబాబు అయితే ప్రజా సంక్షేమం గాలికి
వదిలేసేవారన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన వ్యక్తి
జగన్ మోహన్ రెడ్డి అని, నిరంతరం ప్రజా సంక్షేమ కోసం గత 13ఏళ్లుగా ఆలోచన
చేస్తున్న వ్యక్తి జగన్ అని అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం ఎంతో కష్టం పడిన
వ్యక్తి జగన్అని, హేమ హేమీలు ఇబ్బంది పెట్టినా ప్రజల కోసం పని చేసిన వ్యక్తి
జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మాటలు మార్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, అన్నయ్యని
మోసం చేసిన వ్యక్తి అని, పవన్ విశ్వాస ఘాతకుడని అన్నారు. జనసేన పార్టీ పెట్టి
కూడా 10 ఏళ్లు అయిందని, అయితే రాష్ట్రానికి ఏమి లాభం జరిగిందన్నారు.175 నియోజక
వర్గాల్లో పోటీ చేసే దమ్ము పవన్ కళ్యాణ్ కి, చంద్రబాబు కి ఉందా అని సవాల్
విసిరారు. పవన్ కల్యాణ్ అధికారంలోకి రావటం ఒక కల అని, పవన్ కళ్యాణ్ ఈ
రాష్ట్రం లో పెద్ద ఉసరవెల్లి అని దుయ్యబట్టారు. పూటకో పార్టీతో పొత్తు
పెట్టుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దుర్గ గుడి చైర్మన్ కర్నాటి
రాంబాబు మాజీ చైర్మన్ పైలా సోమినాయుడు,ఆకుల శ్రీనివాసరావు, ఇండస్ట్రియల్
డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండి పుణ్యశిల, జిల్లా వక్ఫ్ బోర్డ్ చైర్మన్
గౌస్ మొహిద్దిన్, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి బుజ్జి,
కొనకళ్ళ విద్యాధర రావు, జిల్లాలోని పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, వివిధ
డివిజన్ల కార్పొరేటర్లు వివిధ కార్పొరేషన్లో చైర్మన్లు డైరెక్టర్లు పార్టీ
నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.