వీధి రౌడీలా మాట్లాడటం ఎంత వరకు సబబని ముద్రగడ ప్రశ్న
తాట తీస్తా, చెప్పుతో కొడతా అంటున్నారని విమర్శ
ఎమ్మెల్యేలను తిట్టడం కోసం సమయాన్ని వృథా చేసుకోవద్దని హితవు
విజయవాడ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఘాటు
లేఖ రాశారు. పార్టీ పెట్టిన తర్వాత 10 మందితో ప్రేమించబడేలా ఉండాలని, వీధి
రౌడీలా మాట్లాడటం ఎంత వరకు సబబని లేఖలో ఆయన ప్రశ్నించారు. మీ ప్రసంగాల్లో తాట
తీస్తా, నార తీస్తా, గుండు గీయిస్తా, కింద కూర్చోబెడతా, చెప్పుతో కొడతా అంటూ
పదేపదే అంటున్నారని… ఇప్పటి వరకు ఎంత మందిని ఇలా చేశారో చెప్పాలని అన్నారు.
ఎమ్మెల్యేలను తిట్టడం కోసం సమయాన్ని వృథా చేసుకోవద్దని హితవు పలికారు.