విజయవాడ : పవన్ కళ్యాణ్ ఎవరితో కలిసిన లాభం లేదని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి
శ్రీనివాసరావు అన్నారు. స్థానిక 38వ డివిజన్ లోని 159వ సచివాలయం పరిధిలో 183వ
రోజు శనివారం గడప గడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో
పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ఆయా
ప్రాంతాలలో పర్యటించి గడప గడపకు వెళ్లి ప్రజలకు ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వ
పరంగా జరిగిన సంక్షేమ పథకాల వివరాలు తెలియచేస్తూ సమస్యలు అడిగి
తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ అందరం కలిసి గడప గడపకు
వెళ్తున్నాం అన్నారు. ఈ రోజు అంతా కొండా ప్రాంతంలో పర్యటించడం జరిగిందన్నారు.
అరకొర మెట్ల సమస్యలు మా దృష్టికి వచ్చింది త్వరితగతిన అభివృద్ధి చేస్తామని
హామీ ఇచ్చారు. అర్హత ఉన్నవారందరికీ పథకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. లోకేష్
పాదయాత్ర ఫెయిల్ అయిందన్నారు.పాదయాత్రకు ప్రజాదరణ లేదన్నారు. స్పష్టంగా
మాట్లాడలేని వ్యక్తి లోకేష్ అన్నారు. లోకేష్ మీటింగ్ లో ఒక మహిళ జగన్
ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారు. టీడీపీ వాళ్ళే జగన్ ముఖ్యమంత్రి కావాలని
కోరుతున్నరన్నారు. లోకేష్ కి మతి పోయిందన్నారు. లోకేష్ షో యాత్ర అని
దుయ్యబట్టారు. లోకేష్ నీ జీవితంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆదరించారన్నారు. ప్రజల
కష్టాలు తీర్చేందుకు జగన్ మోహన్ సిద్దంగా ఉన్నారన్నారు. నారా వారికి వారహికి
ఎంటి సంబంధం అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ లోకేష్ లు పనికిరాని సుంటలు
బఫూన్లన్నారు. పవన్ కళ్యాణ్ ఏ రోజు ఎవరితో వుంటారో తెలియదన్నారు. పూటకో పార్టీ
తో ఉంటారని అన్నారు. పవన్ కళ్యాణ్ ఎవరితో కలిసిన లాభం లేదన్నారు. పవన్ కళ్యాణ్
కి సిగ్గుండాలన్నారు. టీడీపీలో దేవాలయాలు కుల్చేస్తే మా ప్రభుత్వం వచ్చాకా
అద్భుతంగా నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన
భాగ్యలక్ష్మి,38వ డివిజన్ కార్పొరేటర్ షేక్ రహామతున్నిసా, హయత్ డివిజన్
నాయకులు కార్యకర్తలు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల
చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సచివాలయ సిబ్బంది
వాలంటీర్లు, నగరపాలక సంస్థ, రెవెన్యూ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.