విజయవాడ : జనసేనాని పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకుల అనుచిత వ్యాఖ్యలకు నిరసన
తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నట్లు 42వ డివిజన్
జనసేన అధ్యక్షురాలు తిరుపతి అనూష చెప్పారు. మంగళవారం సాయంత్రం 42 వ డివిజన్
ట్రెండ్ సెట్ సెంటర్ లో పవన్ చిత్రపటానికి అనూష ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా తిరుపతి అనూష మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడుతున్న వాలంటీర్లను తమ
పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విమర్శించారని, అయితే పవన్ కళ్యాణ్ పై వైసీపీ
నాయకులు అడ్డగోలు ఆరోపణలు చేస్తూ దూషించడం దారుణమని విమర్శించారు. రాష్ట్రంలో
వైసిపి పాలనలో మహిళల మిస్సింగ్ కేసులు 30 వేల వరకు నమోదయ్యాయని విమర్శించారు.
మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పవన్ కళ్యాణ్ కు కాదు, వేలాదిమంది
మహిళల మిస్సింగ్ పై దమ్ముంటే జగన్ కు నోటీసులివ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
స్థానిక 42 డివిజన్ కార్పొరేటర్ చైతన్య రెడ్డి నకిలీ వాలంటీర్లను తీసుకువచ్చి
పవన్ కళ్యాణ్ చిత్రపటంను దగ్ధం చేయడం దారుణమని, ఆమె కార్పొరేటరా లేక వాలంటీరా
అనీ అనూష విమర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మహేశ్వరి, సూరిబాబు,
ఆవుల ప్రసాద్, కృష్ణ ,తదితరులు పాల్గొన్నారు.