విజయవాడ : విశాఖలో ఏర్పాటు చేసిన బీజేపీ సభలో కేంద్రహోం మంత్రి అమిత్ షా
చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
పార్టీ పరంగా అమిత్ షా విమర్శలు చేశారు. దేశంలో ఏపీ భాగం కాదు అన్నట్టుగా
అమిత్ షా మాట్లాడారు. ఎవరో స్క్రిప్టులు రాసిస్తే చదివేయడం కాదు అంటూ
కామెంట్స్ చేశారు. కాగా, సజ్జల మీడియాతో మాట్లాడుతూ జనసేన పవన్ కల్యాణ్
ఖచ్చితమైన ఆలోచనలతో రాజకీయాలు చేయడం లేదు. పవన్ వాయిదా వేసుకుంటూ యాత్రలు
చేయడం కాదు. గత రెండుసార్లూ పవన్ చంద్రబాబునే మోశారు. ఇప్పుడు మరోసారి పవన్
చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. ఇదే సమయంలో బీసీ
కులాల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
సర్కార్ కృషిచేస్తోంది. వెనుకబడ్డ కులాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం
ఆర్థికంగా చేయూతను అందిస్తోందన్నారు. సీఎం జగన్ అధికారంలోకి రాకముందు బీసీ
డిక్లరేషన్ చేస్తే ఒక్కొక్కరు ఒక్కోలా అనుకున్నారు. అధికారంలోకి వచ్చాక
మేనిఫెస్టోలో చెప్పినవి, చెప్పనివి కూడా సీఎం జగన్ చేసి చూపించారున్నారు.
రాష్ట్రంలో జనాభా ప్రకారం అందరికీ న్యాయం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్.
సామాజిక న్యాయం అమలు కాకపోతే సమాజానికి మంచిది కాదు. ఎప్పటికైనా తిరుగుబాటు
వస్తుంది. అందరి చేతుల్లోనూ అధికారం ఉండాలనే దిశగానే సీఎం జగన్ అడుగులు
వేశారు. రాబోయే ఐదారేళ్లలో ఎంతో మార్పు వస్తుంది. కాలం మారుతోంది. ఓ నలుగురు
కూర్చుని రాజకీయం చేస్తామంటే కుదరదు. పేదలు, సంపన్నులతో కలిసి విద్యను
అభ్యసించేలా చేస్తున్నాం. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ప్రతీ
విద్యార్ధీ ఆత్మగౌరవంతో స్కూళ్లకు వెళ్లేలా సదుపాయాలు కల్పిస్తున్నాం. ఈ
నాలుగేళ్లలో సామాజిక న్యాయం ఎంతో వేగంగా జరిగింది. రాజకీయ వేదికల్లోనూ ఈ
మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మహిళా సాధికారతకు సీఎం జగన్ పెద్ద పీట
వేశారు. రాబోయే ఎన్నికల్లోనూ బలమైన నాయకత్వం రావడం ఖాయం. 175 కి 175 సీట్లు
దక్కించుకునేలా అడుగులు వేద్దాం. మరింత మెరుగైన మెజార్టీతో సీఎం జగన్ మళ్లీ
ముఖ్యమంత్రి అవుతారు అంటూ వ్యాఖ్యలు చేశారు.