ఏలూరు : ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ మంత్రి హరిరామ జోగయ్య దీక్ష
విరమించారు. దీక్ష విరమించాలని పవన్ కళ్యాణ్ కోరారు. దీంతో పవన్ సూచన మేరకు
దీక్ష విరమిస్తున్నానని హరిరామ జోగయ్య ప్రకటించారు. అంతకుముందు మాజీ మంత్రి
చేగొండి హరి రామ జోగయ్యతో మాట్లాడారు. ఇది మూర్ఖపు, మొండి ప్రభుత్వం. కాపులకు
రిజర్వేషన్లను వేరే విధంగా సాధించుకుందామని జోగయ్యకు చెప్పాను. జోగయ్య లాంటి
వ్యక్తుల సలహాలు, అనుభవం అవసరం అన్నారు పవన్ కళ్యాణ్. దీక్ష విరమించాలని
జోగయ్యకు పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. జోగయ్యకు నచ్చ చెప్పిన పవన దీక్ష
విరమించాలని కోరారు. అన్ని రకాలుగా ఆలోచించి కార్యాచరణ రూపొందిద్దామని
జోగయ్యకు పవన్ సూచించారు. మందులు కూడా వేసుకోకుండా నిరాహార దీక్షకు దిగడం బాధ
కలిగిస్తోందన్నారు పవన్. ఒక్కసారిగా ఇంతటి సాహసం చేస్తే ఎలా అంటూ జోగయ్యకు
పవన్ బుజ్జగించారు. పవన్ సీఎం కావాలి. పవన్ ద్వారా రాష్ట్ర ప్రజలు
బాగుండాలన్నదే తన కోరికన్నారు జోగయ్య. తాను వచ్చి జోగయ్యను కలుస్తానన్నారు
పవన్. జోగయ్య మార్గ దర్శకత్వం వహించాలన్నారు పవన్. సీఎం జగన్ దిగి రావాలన్నదే
తన ఆ ఆలోచనన్న జోగయ్య పవన్ సూచనకు సానుకూలంగా స్పందించారు. దిగిరావాలంటే
రాజకీయంగా ఆలోచన చేద్దామన్నారు పవన్. ఆమరణ దీక్షల్లాంటివి వద్దన్న జనసేనాని
కనీసం దీక్షకు విరామం ప్రకటించాలని జోగయ్యను పవన్ కళ్యాణ్ కోరారు.