విశాఖపట్నం : ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
నెరవేర్చారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అన్ని వర్గాలకు సీఎం జగన్
అండగా నిలిచారని పేర్కొన్నారు. బీసీల గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏదో
మాట్లాడుతున్నాడని, సరైన అవగాహన లేకుండా ఆయన మాట్లాడుతున్నాడని విమర్శించారు.
ఏలూరులో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ప్రకారం రాష్ట్రంలో బీసీలకు ప్రయోజనం
జరుగుతోందని స్పష్టం చేశారు. సినిమాల్లో రాక్షసుల మాదిరిగా కొందరు
రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పవన్ వల్ల కాపులకు ఎలాంటి
మేలు జరగలేదని తెలిపారు. గతంలో ఎప్పుడైనా రాజ్య సభ, ఎమ్మెల్సీ టికెట్లు
బీసీలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఓడిపోయే స్థానంలో వర్ల రామయ్య గెలుస్తుందని
అనుకునే స్థానాల్లో సీఎం రమేష్ లాంటి నాయకులకు టీడీపీ టికెట్లు ఇచ్చిందని
విమర్శించారు. సెలబ్రిటీ పార్టీ నాయకుడు పవన్ వల్ల కాపులకు ఏమైనా మేలు
జరిగిందా అని ప్రశ్నించారు.