మండిపడ్డారు. పవన్ వారాహి యాత్ర అట్టర్ ఫ్లాప్ అని, ఆయన ప్రసంగాలు
ఉన్మాదానికి ఎక్కువ, పిచ్చికి తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. పవన్ మానసిక
స్థితి బాగాలేదని, ఏం మాట్లాడతాడో అతనికే అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో
శాంతి భద్రతలు లేవని పవన్ ఎలా చెప్తారని ప్రశ్నించారు. ద్వారంపూడి సవాల్‌కు
పవన్ తోక ముడిచారన్నారు.
ప్రతీ గొడవలోనూ జనసేన కార్యకర్తలే : ‘ప్రతీ గొడవలోనూ జనసేన కార్యకర్తలే
ఉంటున్నారు. తమ కార్యకర్తలను గూండాలుగా, రౌడీలుగా తయారు చేసేలా పవన్
రెచ్చగొడుతున్నాడు. రాష్ట్రం అగ్ని గుండంగా మారిందంటూ చంద్రబాబు, పవన్ ఇద్దరూ
కుట్రలు చేస్తున్నారు. అధికారం రావడమే ఆలస్యం అందరినీ లోపల వేసేస్తారట దాని
కోసం మీకు ఓటు వేయాలా?. చంద్రబాబుకి, అసలు పుత్రుడు, దత్తపుత్రుడికి దమ్ముంటే
మా అయిదేళ్ల పాలన చూసి ఓటు వేయమని చెప్పమనండి. చంద్రబాబు అయిదేళ్ల పాలనలో ఏ
రోజూ పవన్ కల్యాణ్ ప్రశ్నించలేదు. మా పాలన చూసి వేయమని మేము అడుగుతున్నాం.
మేము సవాల్ విసురుతున్నాం. మీరు 2014-19 పాలన చూసి ఓటు వేయమని అడగగలరా?.
చంద్రబాబు లాంటి చండాలుడు రాష్ట్రానికి అవసరం లేదని ప్రజల అభిప్రాయం. 219
దేవాలయాలు కూల్చేశామని పవన్ విమర్శిస్తున్నాడు. గుళ్లు కూల్చేసిన దుర్మార్గుడు
చంద్రబాబు కదా. బీజేపీ, టీడీపీ హయాంలో కదా గుళ్లని కూల్చేసింది. ఆ సమయంలో
దేవాదాయ మంత్రి బీజేపీ నేత కాదా? కూల్చేసిన గుళ్లను సీఎం జగన్
పునఃనిర్మిస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.