వీడియోను రిలీజ్ చేసి సంచలనం రేపారు. ఇటీవల పెళ్లి వీడియోను రిలీజ్ చేశారు.
ఆ వీడియోకు ‘ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్లు, ఏడడుగులు, మీ
ఆశీస్సులు కోరుకుంటూ పవిత్ర – నరేశ్’ అంటూ కాప్షన్ ఇచ్చారు. దాంతో ఆ వీడియో
క్షణాల్లోనే వైరల్ అయింది.తొలుత ఆ వీడియోలు నిజమేనని అందరూ అనుకున్నారు. కానీ తర్వాత ఊహించని ట్విస్ట్
ఇచ్చారు నరేశ్, పవిత్ర. సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఆ వీడియోలను రిలీజ్
చేసినట్లు వెల్లడైంది. ఆ సినిమానే ‘మళ్లీ పెళ్లి’.
పవిత్ర, నరేశ్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమాను ఎం.ఎస్.రాజు తెరకెక్కిస్తున్నారు.
విజయకృష్ణ మూవీస్ పతాకంపై నరేశ్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా టీజర్
రిలీజైంది. నరేశ్ తన జీవితంలో జరిగిన వివాదాలనే సినిమాగా చేస్తున్నట్లు
టీజర్‌ను చూస్తే తెలుస్తోంది.
రమ్య రఘుపతితో గొడవలు.. ఆమె మీడియా ముందుకు వచ్చి చేసిన ఆరోపణలు.. హోటల్లో
నరేశ్, పవిత్రా లోకేశ్ కనిపించడం.. రమ్యను చూస్తూ నరేశ్ విజిల్స్ వేసుకుంటూ
వెళ్లడం.. ఇదంతా మీడియా ఎదుటే జరగడం వంటి సన్నివేశాలతో టీజర్ మొత్తం
నింపేశారు. మొత్తంగా రియల్ ఇన్సిడెంట్స్‌ని రీల్లోకి కన్వర్ట్ చేసినట్లుగా
కనిపిస్తోంది.
నరేశ్ మాజీ భార్య పాత్రలో తమిళ నటి వనిత విజయ్ కుమార్ నటించారు. ఈ చిత్రంలో
జయసుధ, శరత్ బాబు కూడా నటించారు. ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి స్వరాలు, అరుల్
దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. మే నెలలో విడుదల చేయనున్నట్లు టీజర్
చివర్లో ప్రకటించారు.