పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం కడియద్దలో ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పేలుడు జరిగిన బాణసంచా పరిశ్రమ అన్నవరం అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. ఈ పేలుడు ఘటన పట్ల స్పందించిన అగ్నిమాపక దళం వెంటనే స్పందించింది. ఈ పరిశ్రమ ఊరి చివర చెరువు వద్ద ఉండడంతో అగ్నిమాపక శకటం అక్కడికి చేరుకోవడానికి కొంచెం సమయం పట్టింది. అప్పటికీ, ప్రమాద స్థలికి 300 మీటర్ల దూరంలోనే అగ్నిమాపక శకటం నిలిపివేయాల్సి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో బాణసంచా కర్మాగారంలో 10 మంది ఉన్నట్టు భావిస్తున్నారు. ఒక్కసారిగా విస్ఫోటనం చెందడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.