ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఎ
ఇన్సాఫ్(పీటీఐ) నేత ఇమ్రాన్‌ఖాన్‌పై ఆరు కేసులు నమోదయ్యాయి. వీటిలో మూడు
కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టంలోని నిబంధనల కిందకు వస్తాయి. ఈ ఏడాది మేలో
ఇస్లామాబాద్‌లోని హైకోర్టు వద్ద నాటకీయ పరిణామాల మధ్య ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు
చేయడంతో అక్కడ హింస చెలరేగింది. ఆయన మద్దతుదారులు రావల్పిండిలోని ఆర్మీ జనరల్
ప్రధాన కార్యాలయంతో పాటు మెట్రోస్టేషన్‌పై దాడికి దిగారు. ఈ ఘటనలకుగాను
సంయుక్త దర్యాప్తు బృందాలు(జేఐటీ) ఆరు కేసులు నమోదు చేశాయి. మే 9,10 తేదీల్లో
నమోదైన ఈ కేసుల్లో తాజాగా ఇమ్రాన్‌ఖాన్ పేరును చేర్చినట్లు స్థానిక వార్తా
సంస్థలు వెల్లడించాయి. గతేడాది ఏప్రిల్‌లో ఇమ్రాన్‌ఖాన్ పదవీచ్యుతుడైనప్పటి
నుంచి దేశవ్యాప్తంగా ఆయనపై సుమారు 150 కేసులు నమోదయ్యాయి.