విజయవాడ : పాకిస్ధాన్ మంత్రి బిలావల్ బుట్టో వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర
వ్యాప్తంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదేశాలతో భారీస్ధాయిలో
బిజెపి శ్రేణులు నిరసనకు దిగాయి. విజయవాడ బిజెపి సిటీ కార్యాలయం నుంచి లెనిన్
సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ కు
వ్యతిరేకంగా నినాదాలు హొరెత్తించారు. నిరసనలో పాల్గొన్న బిజెపి ఎపి అధ్యక్షుడు
సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శులు వేటుకూరి సూర్యనారాయణ రాజు, విష్ణు
వర్ధన్ రెడ్డి, ఓబిసి మోర్చా జాతీయ కార్యదర్శి డాక్టర్ పార్ధ సారధి తదితరులు
ప్రదర్శన అగ్రభాగాన ఉన్నారు.
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ
పాకిస్థాన్ లో హిందువుల పై తరచు దాడులు జరుగుతున్నా పాకిస్థాన్ ఏనాడు
పట్టించుకోలేదని ఆరోపించారు. హిందువులకు పాకిస్థాన్ లో రక్షణ లేదని ఈ విషయం
ప్రపంచ సమాజం గుర్తించాలన్నారు.
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి అత్యంత హేయమైన భాషను వినియోగించారని బిజెపి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి ఆరోపించారు. లెనిన్ సెంటర్ లో
పాకిస్ధాన్ మంత్రి దిష్టి బొమ్మను బిజెపి నేతలు దగ్ధం చేశారు. అనంతరం బిజెపి
ఎపి అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ పాకిస్ధాన్ మంత్రి బిలావల్
బుట్టో న్యూయార్క్ లో దేశం పైన ప్రధాని మోదీ పై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా
ఖండిస్తున్నాం. బిన్ లాడెన్ చనిపోయినా ఇంకా వ్యక్తి బ్రతికే ఉన్నాడని బుట్టో
వ్యాఖ్యలను దేశం హర్షించదని హితవు పలికారు. పాకిస్ధాన్ కు చెందిన వ్యక్తులు
అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలన్నారు .పాకిస్ధాన్ భూ భాగం లోకి వెళ్ళి దాడులు
నిర్వహించాం అయినా బుద్దిరాలేదన్నారు సోము వీర్రాజు. ప్రధాని నరేంద్ర మోడీ
పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని భారత జాతికి సమాధానం చెప్పాలన్నారు.
అనేక సార్లు మీ పైన దాడి చేస్తే తోక ముడిచారు .పాకిస్ధాన్ గుండెల్లో భారత్
నిద్రపోతుం దన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బబ్బూరి శ్రీరాం, దాసం
ఉమాహేశ్వర రాజు, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, రాష్ట్ర
మీడియా ఇంఛార్జి లక్ష్మీ పతిరాజా ,పట్నాయక్, ఉప్పల పాటి శ్రీనివాస రాజు,
మహ్మద్ సయ్యద్ బాషా, పీయూష్, వెంకయ్యనాయుడు, భోగవల్లి శ్రీధర్ ,ఎస్సీ మోర్చా
జాతీయ కార్యవర్గ సభ్యురాలు బొడ్డు నాగలక్ష్మి , తదితరులు పాల్గొన్నారు.