దుబాయ్ లోని ప్రముఖ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన పర్వేజ్
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముషారఫ్
2001 నుంచి 2008 వరకు పాక్ అధ్యక్షుడిగా పని చేసిన పర్వేజ్
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, ఆ దేశ మిలటరీ మాజీ అధినేత పర్వేజ్ ముషారఫ్
కన్నుమూశారు. దుబాయ్ లో ఆదివారం తుదిశాస విచారని పాక్ మీడియా ఆదివారం
తెలిపింది. ముషారఫ్ చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొంతకాలంగా
దుబాయ్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం
తుదిశ్వాస విడిచినట్లు పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ముషారఫ్ వయసు 79
ఏళ్లు. ముషారఫ్ 1943 ఆగస్టు 11న జన్మించారు. కరాచీలోని సెయింట్ ప్యాట్రిక్స్
లో ప్రాధమిక విద్యాభ్యాసం చేశారు. ఆర్మీలోకి వచ్చిన ఆయన 1998లో జనరల్ ర్యాంక్
సాధించారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1999లో పాక్
ప్రభుత్వాన్నిమిలటరీ అధీనంలోకి తీసుకోగా.. పర్వేజ్ దేశాధ్యక్షుడయ్యారు. 2001
నుంచి 2008 వరకు పాక్ అధ్యక్షుడిగా పని చేశారు.