వెంకటగిరి ఎక్స్ప్రస్ న్యూస్ : తిరుపతి జిల్లా వెంకటగిరి పట్నంలోని ఆర్ వి ఆర్ కే బాలికొన్నత పాఠశాల కు ఉపాధ్యాయుల భోధనాభ్యసన పరికరములనుగోరంట్లవాసుబాబు యు ఎస్ ఏ వితరణ చేశారు. సోమవారం ఈ పరికరాలను ముఖ్య అతిథులుగా విచ్చేసిన సర్కస్పెక్టర్ సంగమేశ్వర రావు రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంతో సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చి మన పాఠశాలలో ఉపాధ్యాయులకు ఉపయోగపడే బోధన అభ్యసన పరికరాలు అందజేయడం చాలా గొప్పతనమని వారికి స్కూల్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ పద్మావతి, ఇంచార్జ్ వీడియో విజయలక్ష్మి, బాల్కోనత పాఠశాల టీచర్లు పాల్గొన్నారు.