ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, రాష్ట్ర గ్రంధాలయ పరిషత్
చైర్మన్ మందపాటి శేషగిరిరావు సమావేశంవిజయవాడ : పాత్రికేయుల రచనలను ప్రోత్సహిస్తూ వారు రచించిన పుస్తకాలను అందరికి
అందుబాటులో వుంచేలా పుస్తకాలను కొనుగోలు చేసి అన్ని జిల్లా , తాలుకా, పౌర
గ్రంథాలయాల్లో పాఠకులకు అందుబాటులో ఉంచాలని కోరుతూ రాసిన లేఖను రాష్ట్ర
గ్రంధాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావుకు ప్రెస్ అకాడమి చైర్మన్
కొమ్మినేని శ్రీనివాసరావు లేఖను అందజేసారు. అందుకు రాష్ట్ర గ్రంధాలయ పరిషత్
చైర్మన్ స్పందిస్తూ గ్రంధాలయ సంస్థ నుంచి కొనుగోలు చేసి పుస్తక రచయితలైన
జర్నలిస్టులకు తగిన విధంగా ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు. త్వరలో ఆచార్య
నాగార్జున యూనివర్సిటీలో జరగబోయే జర్నలిజం విలువలు- ప్రామాణిక సూత్రాలు,
రాష్ట్ర అభివృధ్దిలో మీడియా పాత్ర అంశాల సదస్సులో పాలు పంచుకోవాలని కొమ్మినేని
శ్రీనివాసరావు రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావును కోరారు.
విజయవాడ ప్రెస్ అకాడమి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో గ్రంధాలయ సంస్థ
పాలకమండలి సభ్యులు జీను మహేశ్ బాబు పాల్గొన్నారు. ప్రెస్ అకాడమి సెక్రటరీ
మామిడి పల్లి బాలగంగాధర్ తిలక్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసారు.