రాపూరు-( వెంకటగిరి అసెంబ్లీ ఎక్స్ ప్రెస్) రాపూరు మండలంలోని సంక్రాంతిపల్లి, పాప కన్ను మధుసూదన్ రెడ్డి గార్డెన్స్ నందు రాపూరు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఎన్నికల శంఖారావం సమావేశమును నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్,తిరుపతి జిల్లా అధ్యక్షులు,వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఎలక్షన్లు త్వరలో వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు కష్టపడాలని,మీ పంచాయతీలోని ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలని, వారికి ఏమైనా సమస్యలు ఉంటే మీరు అందరు కలిసి పరిష్కారం చేసుకోవాలని ,వెంకటగిరి నియోజకవర్గంలో జరిగిన వైస్సార్సీపీ సభకు వెంకటగిరి నియోజకవర్గంలో ప్రజలు మాత్రమే వచ్చారని, ఈరోజు వెంకటగిరి లో జరిగే తెలుగుదేశం పార్టీ సభ తిరుపతి జిల్లాలోని 7 నియోజవర్గాలకు సంబంధించిన సభని ,ఇటువంటి సభకు తెలుగుదేశం పార్టీ నాయుకులు తప్ప ప్రజలు ఎవరు రాలేదని,రాపూరులో 5వ తేదీన జరిగిన బస్సు యాత్ర సమయంలో విలేకరుల సమావేశంలో చెప్పినాను తెలుగుదేశం పార్టీ వారు రాపూరులో జరిగిన సభకు పోటీపడితే చాలని తెలిపాను. నేను చెప్పినట్లే తిరుపతి జిల్లాలోని 7 నియోజకవర్గంలో కలిపి తెలుగుదేశం పార్టీ సభ పెట్టిన రాపూర్ లో జరిగిన సభకు పోటీ పడలేదని. తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉన్నదని అనుకోని ఏ వైఎస్ఆర్సిపి నాయకులు విశ్రాంతంగా ఉండకూడదని మీ పంచాయతీలోని ప్రతి వ్యక్తిని కలుపుకొని పోవాలని అప్పుడే మన పార్టీ బలంగా ఉంటుందని . మీ పంచాయతీలో ఏ సమస్య ఉన్న నేరుగా నాతో మాట్లాడవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల వై.సి.పి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.