దమ్మున్న నేత సీఎం జగన్ మాత్రమే
మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
పోలాకి : అధికారం కోసం, పదవికోసం ఎంతటి నీచానికైనా వెనుదీయని పాపాత్ముడు
చంద్రబాబు నాయుడని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ధ్వజమెత్తారు. బుధవారం
పోలాకి మండలం వనవిష్ణుపురంలో జరిగిన బహిరంగసభలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన
కృష్ణదాస్ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తండ్రి సింహంలాంటి డాక్టర్
వైఎస్ రాజశేఖరెడ్డి అని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసని అన్నారు. అదే
చంద్రబాబు తండ్రి ఎవరో మీకు తెలుసా? నాకే తెలియదు..మీకు ఏం తెలుస్తుందని
అక్కడున్నవారిని ఉద్దేశించి అన్నారు. అబద్దాలకోరు చంద్రబాబుని ప్రజలు నమ్మలేదు
కాబట్టే గత ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు పరిమితం చేసి పదవినుంచి దింపేశారని
అన్నారు. వైఎస్ జగన్ పట్ల ఉన్న విశ్వసనీయత వల్లే 151 స్థానాల్లో సీపీని ప్రజలు
గెలిపించారని చెప్పారు. ఇలాంటి సమర్ధతగల జగన్ కూ, అడ్డదారిలో సీఎం అయిన
చంద్రబాబుకూ పోలికే లేదన్నారు. సీఎం పదవికోసం పిల్లనిచ్చిన మామ ఎన్ టీ ఆర్ నే
కుర్చీ నుంచి కిందకు లాగేసిన చంద్రబాబు ఎలాంటి కుయుక్తిపరుడో ప్రజలందరికీ
తెలుసన్నారు. 2009లో సీఎం మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతితో
రాష్త్ర ప్రజలు విషాద సంక్షోభంలో మునిగిపోయారని, ఆ సమయంలో ఆయనపై అవధుల్లేని
అభిమానం, ప్రేమ, గౌరవంతో మనసులో బాధని జీర్ణించుకోలేక 700 మంది మృతి
చెందారన్నారు. వారి కుటుంబాలను ఓదార్చాలని ఆయన తనయుడుగా వైఎస్ జగన్
సంకల్పిస్తే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అనుమతి ఇవ్వలేదని అన్నారు.
అయినాసరే రాజకీయాలకన్న మానవత్వమే మిన్న అని భావించిన జగన్ కాంగ్రెస్ పార్టీకి
రాజీనామాచేసి 700 కుటుంబాలను కలిసి ఓదార్చారన్నారు. ఆ నేపథ్యంలోనే తన తండ్రి
వైఎస్ ఆర్ ను గుర్తుతెచ్చే విధంగా ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ”ని
ఏర్పాటు చేసారన్నారు. ఇది ఒక చారిత్రక సందర్భంలో ఏర్పాటైందన్నారు. అదే
చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం వెన్నుపోటు రాజకీయ సందర్భంగా జరిగిందన్నారు. ఈ
రెండింటికి తేడా విజ్ఞతగల ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారన్నారు. విశ్వసనీయతకు
ఐకాన్ గా సీఎం జగన్ నిలిస్తే, వెన్నుపోటుకు బ్రాండ్ అంబసిడర్ గా చంద్రబాబు
మిగిలిపోయారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థని ఏర్పాటుచేసి
విద్య, వైద్యం, వ్యవసాయం..ఇలా అన్ని రంగాల్లో సంక్షేమాన్ని తీసుకొచ్చిన జగన్
ప్రతి ఒక్కరికీ ఆత్మీయునిగా మారారన్నారు. చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో
అబద్దాలు, కుట్రలు, కుతంత్రాలతో మోసం చేయడం తప్ప ఈ రాష్ట్ర ప్రజల మేలుకోసం
చేసింది ఏమీ లెదన్నారు. ఈ జిల్లాలోని ఉద్దానం ప్రాంతీయులకు కల్లబొల్లి
కబుర్లుచెప్పి మభ్యపెట్టడంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పోటీ పడ్దారన్నారు. జగన్
సీఎం అయిన వెంటనే రు700 కోట్లతో ఉద్దానానికి ప్రత్త్యేకంగా తాగునీటి గ్రిడ్
ఏర్పాటు చేస్తున్నారన్నారు. అంతేకాకుండా కిడ్నీ రీసెర్చ్ సెంటర్, కిడ్ణీ
బాధితులకు పెన్షన్ గా రు10 వేలు చొప్పున అందిస్తున్నారని అన్నారు. ఇవన్నీ
చందర్బాబు తన హయాంలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. జగన్ అమలు చేస్తున్న
పథకాలు ప్రజాసంక్షేమం కోసమైతే..చంద్రబాబు ఇచ్చే హామీలు కేవలం ఓట్లు కాజేసి
మోసం చేయడానికేనన్న వాస్తవాన్ని అంతా గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో ఎంఎల్సీ
నర్తు రామారావు, డిసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఇచ్చాపురం మున్సిపల్
చైర్ పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.