ప్రముఖ నటి సమంత మోస్ట్ పాప్యులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో నెంబర్ వన్ గా
నిలిచారు. ఇండియన్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ) తాజాగా విడుదల చేసిన పాప్యులర్
ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో సమంత అగ్రస్థానాన్ని అలంకరించడం విశేషం.ఐఎండీబీ గతంలో విడుదల చేసిన జాబితాలో సమంత 9వ స్థానంలో ఉండగా, ఈసారి ఏకంగా
నెం.1 స్థానానికి చేరుకుంది. తాజాగా జాబితాలో దక్షిణాదికి చెందిన మరో
ముద్దుగుమ్మ పూజ హెగ్డే 17వ స్థానంలో ఉంది. అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్
వంటి స్టార్లను కూడా వెనక్కి నెట్టి సమంత అగ్రపీఠం అందుకుంది.

పుష్ప చిత్రంలో ఊ అంటావా పాట, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో సమంత నేషనల్
లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది. యశోద, శాకుంతలం చిత్రాల్లో ఆమె నటనకు ఫుల్
మార్కులు పడ్డాయి.