తిరుపతి : పారదర్శకంగానే శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు కేటాయించామని,
ట్రస్ట్‌కు ఇప్పటివరకు రూ.880 కోట్ల విరాళాలు వచ్చినట్లు టీటీడీ ఈవో
ధర్మారెడ్డి వెల్లడించారు. 9 లక్షల మంది భక్తులు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా
దర్శనం చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఆయన ‘డయల్ యువర్ ఈవో’
కార్యక్రమంలో మాట్లాడుతూ, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 2,500 ఆలయాల నిర్మాణం
జరుగుతోందని, ఈ ట్రస్ట్ ద్వారా విరాళాలు ఇచ్చిన భక్తులు ఒక్క ఫిర్యాదు కూడా
చేయలేదని స్పష్టం చేశారు. సమ్మర్ రద్దీ నేపథ్యంలో రూ.300 రూపాయల దర్శన టికెట్ల
కోటా తగ్గించామని, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో తిరిగి రూ.300 దర్శన టికెట్లు
ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తల మధ్య ఎక్కువ
తోపులాట లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తామని, మహాద్వారం నుంచి బంగారు వాకిలి
వరకు సింగిల్ లైన్లో భక్తులను అనుమతిస్తున్నామని ఈవో పేర్కొన్నారు.