విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రజలకు
పారదర్శక పాలన అందిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ
మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు రెవెన్యూ శాఖలో చేపట్టిన సంస్కరణలు సత్
ఫలితాలను ఇవ్వడం ఇందుకు నిదర్శనం అని, భూముల రీసర్వే విధానం ద్వారా గత 70
ఏళ్ళగా ఎవరూ చేయని సహాసం చేసి రీసర్వే ద్వారా ఇంటి స్థలాలు 22ఏ చుక్కల భూముల
వివాదాలను పరిష్కరించగలిగామని ఇదే విధానాన్ని కొనసాగించి ప్రజలకు సుపరిపాలన
అందించడంలో రెవెన్యూ అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు
రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు.
విజయవాడ లెమన్ ట్రీ పార్క్ హోటల్లో శుక్రవారం నిర్వహించిన కోస్తాంధ్ర
జిల్లాలకు చెందిన రెవెన్యూ అధికారుల ప్రాంతీయ సదస్సుకు మంత్రి ధర్మానప్రసాద్
రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సదస్సులో
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం (రీసర్వే), ఇడ్ల పట్టాల
పంపిణీ, 22ఏ కేసులు, చుక్కల భూముల వివాధాలు, సాదా బైనమా, ఆర్వోఆర్,
ఆర్వోఎఫ్తర్ పట్టా, నాలా, ఆక్రమణ భూముల క్రమబద్దీకరణ, ఆనాదీన భూములు, ఇ-పంట
తదితర అంశాలపై సదస్సులో చర్చించి మరింత సమర్థవంతంగా రెవెన్యూ సేవలను ప్రజలకు
అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఏదేశమైనా,
రాష్ట్రామైనా ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే ఆయా ప్రాంతాల భూముల వినియోగంపై
ఆధారపడి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖకు రెవెన్యూ శాఖ తల్లిలాంటిదన్ని
ప్రభుత్వ శాఖలకు అవసరమైన భూములను, రెవెన్యూను సమకూర్చడం ద్వారా రెవెన్యూ శాఖ
తన భాధ్యతను భుజాన వేసుకుంటుందన్నారు. ప్రభుత్వ అవసరాలు, లక్ష్యాలు, విధానాలను
చేరువ చేసేందుకు రెవెన్యూ శాఖాధికారులు సమిష్టి కృషి ద్వారానే
సాధ్యపడుతుందన్నారు.
సదస్సులో సిసిఎల్ఎ ప్రత్యేక ప్రధాన
కార్యదర్శి జి.సాయిప్రసాద్, రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ,
సిసిఎల్ఎ అదనపు కార్యదర్శి ఎయండి ఇంతియాజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్
కమీషనర్, ఐజి రామకృష్ణ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు, పశ్చిమగోదావరి,
తూర్పుగోదావరి, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, పొట్టి శ్రీరాములు
నెల్లూరు జిల్లాల కలెక్టర్లు పి. రంజిత్ బాషా , ఎస్ డిల్లీరావు,
ప్రసన్నవెంకటేష్, పి. ప్రశాంతి, కె. మాధవిలత, యం వేణుగోపాలరెడ్డి, ఎల్.
శివశంకర్, ఎఎస్ దినేష్ కుమార్ , కె. విజయకృష్ణన్, కె.వి.ఎన్ చక్రధర్ బాబు, ఆయా
జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, ఆర్డీవోలు, తహాశీల్దార్లు ఉన్నారు.