మొబైల్ యాప్ ఆవిష్కరణ
చెన్నై: పారిశుధ్య కార్మికుల జీవనపరిస్థితులను మెరుగుపరచే దిశగా ప్రత్యేక
అభివృద్ధి పథకాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. మదురై
కార్పొరేషన్ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ
పథకాన్ని ప్రారంభించి లోగోను, మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. మదురై
కార్పొరేషన్ పారిశుధ్య కార్మికులకు భద్రతాపరికరాలను ఆయన పంపిణీ చేశారు. ఈ
పథకం ద్వారా పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక పనిముట్లను అందజేయడం, వారి
పనుల్లో సాంకేతిక పరికరాలను ప్రవేశపెట్టడం, వారి పిల్లల చదువులకు భద్రత
కల్పించడం, బ్యాంకుల నుంచి రుణాలు అందజేయడం వంటి సంక్షేమ కార్యక్రమాలను
ప్రభుత్వం అమలు చేస్తుందని స్టాలిన్ పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లోని అర్బన్
మేనేజ్మెంట్ సహకారంతో అమలు చేయనున్న ఈ పథకం ద్వారా కార్పొరేషన్లు, నగర
పంచాయతీల్లో పనిచేసే 18,850 మంది శాశ్వత, 34,442 తాత్కాలిక పారిశుధ్య
కార్మికులు సహా మొత్తం 53,301 మంది లబ్ది పొందనున్నట్టు తెలిపారు. గ్రేటర్
చెన్నై కార్పొరేషన్ పరిధిలో తిరువిక జోన్లో, మదురై కార్పొరేషన్, పుదుకోట,
పొల్లాచ్చి కార్పొరేషన్లు, చేరన్మహాదేవి మునిసిపాలిటీలో ఎంపిక చేసిన
పారిశుధ్య కార్మికులకు ఈ పథకాన్ని విస్తరింపజేస్తామన్నారు. మొబైల్ యాప్
ద్వారా పారిశుధ్య కార్మికులు తమ సమస్యలను ఎప్పటికప్పుడూ తెలియజేసి
పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఎన్ నెహ్రూ, పెరియసామి,
కేకేఎ్‌సఎ్‌సఆర్ రామచంద్రన్, అధికారులు పాల్గొన్నారు.