వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో రాణించాలంటే నైపుణ్యం అవశ్యం
అభివృద్ధి చెందిన దేశాలతో పోటీగా ఏపీలో నైపుణ్య, శిక్షణ
స్కిల్ హబ్స్ ద్వారా వేలాది మంది యువతకి శిక్షణ
విశాఖపట్నం : వాణిజ్యం, పారిశ్రామికాభివృద్ధితోనే సమాజం అభివృద్ధి చెందుతుందని
ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి
బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో రాణించాలంటే
నైపుణ్యం అవశ్యమని ఆయన స్పష్టం చేశారు.అభివృద్ధి చెందిన దేశాలతో పోటీగా ఏపీలో
నైపుణ్య, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖపట్నం
నోవాటెల్ లోని వీ కన్వెన్షన్ వేదికగా శుక్రవారం జరిగిన ఫ్యాప్సీ ఎక్సలెన్స్
అవార్డ్స్ 2022-23 కార్యక్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ముఖ్య అతిథిగా
హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఆంధ్రప్రదేశ్లో స్థిరమైన
పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను సృష్టించడం’పై ప్రసంగించారు. స్కిల్ హబ్స్
ద్వారా వేలాది మంది యువతకి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించి
ఉద్యోగావకాశాలు పెంచుతున్నట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వివరించారు.
నైపుణ్య, శిక్షణను 4 విభాగాలుగా విభజించి స్థానిక వాతావరణం, అవకాశాలకు తగ్గ
రంగాలలో యువతను సంసిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. విశాఖలో మెరైన్, షిప్పింగ్
ఆధారిత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అనకాపల్లిలో ఎమ్ఎస్ఎమ్ఈ శిక్షణ కేంద్రం వంటి
వాటిని వాటిని యువతకు మరింత ఉపయోగపడేలా తీర్చిదిద్దినట్లు మంత్రి స్పష్టం
చేశారు. ప్రైవేట్ లో ఐటీఐ, డిప్లమా చదివి బయటకు వచ్చే యువతీయువకులకు సరైన
శిక్షణ అందడం లేదని మంత్రి అన్నారు. ఈ ఏడాదిలో గతంలో ఎన్నడూ లేనంతగా ఐటీఐ
కళాశాలల మౌలికవసతులు, అభివృద్ధి కోసం తొలిసారి రూ.60 కోట్లు బడ్జెట్ లో
కేటాయించామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. పరిశ్రమల సీఎస్ఆర్ నిధులలో
పారిశ్రామికాభివృద్ధి, నైపుణ్య శిక్షణ రంగానికి ప్రాధాన్యతనిస్తే యువతకు మంచి
భవిష్యత్ అందించినట్లవుతుందని తెలిపారు. రాష్ట్రాలని ప్రమోట్ చేయడానికి
బ్రాండ్ అంబాసిడర్లు అవసరం లేదు..రాష్ట్రమే బ్రాండింగ్ చేస్తుందన్నారు. దీనికి
సంబంధించి గతంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు
మంత్రి బుగ్గన మధ్య జరిగిన చర్చని మంత్రి ప్రస్తావించారు. లలితా జ్యువెల్లరీ
మార్ట్ ను ఉదాహరణగా మంత్రి బుగ్గన పేర్కొన్న విషయాన్ని మరోమారు ఈ వేదికగా
పంచుకున్నారు. అర్హులైన వారికి అవార్డులు అందించడం, శ్రమను గుర్తించడం
అభినందనీయమని ఫ్యాప్సీ పనితీరుని మంత్రి మెచ్చుకున్నారు. పారిశ్రామికవేత్తల
గళాన్ని వినిపించడమే లక్ష్యంగా ఫ్యాప్సీ ఏర్పాటైందని ..ఫ్యాప్సీ
అంకితభావానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
తెలిపారు. ఫ్యాప్సీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2022-23 కార్యక్రమానికి పరిశ్రమల
శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఆదిత్యనాథ్ దాస్,
విశ్రాంత సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్,ఫ్యాప్సీ అధ్యక్షులు
కరుణేంద్ర జాస్తి, మాజీ అధ్యక్షులు సీ.వి అచ్యుతరావు, ఉపాధ్యక్షులు
కె.మల్లికార్జున రావు, తదితరులు హాజరయ్యారు.