గుంటూరు : గురువారం సాయంత్రం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. జిల్లాలో తాను
ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. సీఎంతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన
మీడియాతో మాట్లాడారు. అన్ని అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించా. జిల్లాలో
ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లా. ప్రొటోకాల్ పెద్ద విషయం
కాదు..దానిపై ఫిర్యాదు చేయడానికి ఏముంటుంది. కొత్తగా రీజినల్ కో-ఆర్డినేటర్
పదవిపై చర్చ జరగలేదు. గతంలోనే రీజినల్ కో-ఆర్డినేటర్ పదవి వద్దని రాజీనామా
చేశా. మంత్రి పదవి వదులుకుని ప్రొటోకాల్‌పై ఫీల్ అయ్యేదేముంది. కావాలనే
పార్టీలోని కొందరు దుష్ప్రచారం చేశారు. నేనెప్పుడూ పార్టీపై అలగలేదు.
పార్టీలోని కొందరు ఇబ్బందులు పెట్టారు. సీఎం జగన్‌ను ఎప్పుడూ కలుస్తూనే
ఉన్నాను. నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. నా నియోజకవర్గంలో
రూ.200 కోట్లతో ఇళ్ల స్థలాల పంపిణీకి ఏర్పాటు జరుగుతున్నాయి. సీఎం జగన్‌తో
భేటీ వల్ల సంతృప్తిగానే ఉన్నానని బాలినేని వివరించారు.