విజయవాడ పశ్చిమ : ఇంటింటికి రాబోయే జనసేన ప్రభుత్వం రెండో విడతలో భాగంగా 41 వ
రోజు 51 వ డివిజన్ లో చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి నేమాని.సంజీవరావు
ఆధ్వర్యంలో కొత్తపేట, పోతిన ఆదయ్య వీధి వద్ద నుండి ప్రారంభించి కొండ ప్రాంతంలో
పర్యటిస్తూ ప్రజలను కలుస్తూ సమస్యలను జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ
ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహేష మీడియా
తో మాట్లాడుతూ స్థానికులు అందరూ కూడా ఒకటే చెప్తున్నారని స్థానిక సంస్థల
ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించిన కార్పొరేటర్ గెలిచిన తర్వాత అసలు కనిపించడం
లేదని, కనీసం వీధిలైట్లు వెలగట్లేదనే సమస్యని కార్పొరేటర్ కి చెప్పుకుందాం
అన్నా అందుబాటులో ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ముఖ్యంగా వాటర్
ట్యాంక్ వద్ద చేతమట్టి ఎక్కువైందని అక్కడ మట్టిని తొలగించాలి, పిచ్చి చెట్లు
తొలగించాలని, వాటర్ ట్యాంకు వద్ద నీళ్ల లీకేజీ ఎక్కువగా ఉందని దానికి
మరమ్మతులు చేయించాలని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారని, వాటర్, డ్రైనేజ్,
ర్యాంప్ వంటి సమస్యలు ఇక్కడ వున్నాయని తప్పకుండా ఈ సమస్యలను మున్సిపల్
కమిషనర్ కి తెలియజేసి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని, పార్టీల పరంగా
పథకాలు తొలగిస్తే ఉపేక్షించేది లేదని, జనసేన పార్టీ తరపున మహేష్ తరుపున
మాట్లాడుతున్నారని వారికి పదకాలు తొలగిస్తే వురుకునే ప్రసక్తే లేదని,
ప్రైవేట్ స్కూల్లో ఫీజుల నియంత్రణ లేకుండా అమ్మవడి ఇస్తే ఉపయోగం ఏంటని
మహిళలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మరొక ఒంటరి మహిళ వితంతు ఫించను
తొలగిస్తే ఎలా బతకాలి అని ఆవేదన వ్యక్తం చెయ్యడం జరిగిందని జగన్ మోహన్ రెడ్డి
లేనిపోని అడ్డంకులు పెట్టి పదకాలు తొలగిస్తున్నారని,యువతకు ఉపాధి, ఉద్యోగాల
కల్పన పెట్టుబడులకు ప్రోత్సాహకాలు, రాజధాని అమరావతి అని పవన్ కళ్యాణ్
మేనిఫెస్టోలో చేర్చారని, వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకు మద్దతు ఇవ్వాలని
కోరారు.
చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి నిమాని సంజీవరావు మాట్లాడుతూ కొండప్రాంతాల్లో
సమస్యలు తీష్ట వేశాయని స్పందించే నాధుడే లేడని డ్రైనేజ్ స్ట్రీట్ లైట్స్ వాటర్
ట్యాంక్ దోమలు బెడద వీధి కుక్కలు బెడద తీవ్రంగా ఉన్నాయని ఈ సమస్యల
పరిష్కరించేందుకు ఎన్నికల తర్వాత కార్పొరేటర్ కనబడడం లేదని, పోతిన ఆదయ్య
వీధిలో ర్యాంపు వేయమని పలుమార్లు అధికారులకు చెప్పడం జరిగిన వారు
పట్టించుకోవడంలేదని, ఒక్క అవకాశం అని చెప్పారని ఓటు వేసిన పాపానికి
పార్టీలపరంగా పథకాలు ఇస్తున్నారని, ఈ రోజున కొండ ప్రాంతాల్లో పోతిని మహేష్
పర్యటన వాళ్ళ ఈ ప్రాంత సమస్యలన్నీ తక్షణమే విజయవాడ మున్సిపల్ కమిషనర్
కంప్లైంట్ సెల్ కు వాట్సప్ ద్వారా తక్షణమే పంపామని ప్రతి సమస్యకు పరిష్కారం
అయ్యేంతవరకు కృషి చేస్తామని స్థానిక ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా అండగా
నిలబడతామన్నారు ఈ కార్యక్రమంలో నాగోతి సాయి, బత్తుల రాము, రెడ్డిపల్లి నవీన్,
దుర్గారావు, నేమాలి వాసు, మల్లెపు విజయలక్ష్మి, , కొరగంజి వెంకటరమణ, పులి చేరి
రమేష్, బోట్ట సాయికుమార్, తమ్మిన రఘు, హనుమాన్ సూరిబాబు, రాజేష్ తదితరులు
పాల్గొన్నారు.